ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.
దీంతో టీడీపీ సభ్యులు ఆందోళన దిగారు.
శాసనమండలి ప్రారంభం కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసన చేయడంతో టీడీపీ సభ్యులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.సభలో టీడీపీ ఎమ్మెల్సీల తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు.
ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.టీడీపీ సభ్యుల నిరసన నేపథ్యంలో స్పీకర్ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు.