సోషల్ మీడియా( Social media ) హవా గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఈమధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువగా అడవి జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడాన్ని మనం చూడవచ్చు.
ఎందుకంటే అడవి జంతువుల జీవితం పట్ల మనిషి ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తూనే వుంటాడు.ఇక సాధారణంగా అడవిలో ఓ బలమైన జంతువు బలహీన జంతువులను వేటాడుతూ పబ్బం గదుపుకుంటాయి.
అందుకే ఏ క్షణాల మృత్యువు మీదకొచ్చి పడుతుందో అని చిన్న చిన్న జంతువులు బిక్కుబిక్కుమంటూ బతుకుతూ వుంటాయి.పెద్ద జంతువులు చిన్న జంతువులను వేటాడటం, చిన్న జంతువులు ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడటం చూస్తూనే ఉంటాం.

అందులోను జింక, పులి వేటను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే భయానక వేటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రెప్ప వేయకుండా ఆ దృశ్యాలను తిలకిస్తున్నారు.వీడియోని ఒకసారి గమనిస్తే ఓ జింక అడవిలో చెట్టు కింద పచ్చిక మేస్తోంది.ఆ జింక( Deer )ను వేటాడటానికి ఓ చిరుత చెట్టుమీద మాటు వేసింది.
అది అదను చూసి ఒక్కసారిగా జింకమీదకు దూకింది.దాడి జరుగుతుందని అస్సలు ఊహించని జింక, చిరుత కబంద హస్తాల్లో చిక్కింది.
అయినప్పటికీ అక్కడి నుండి పారిపోవడానికి అది తన శాయాశక్తులా ప్రయత్నం చేసింది.

కానీ చిరుత( Leopard ) కబందహస్తలనుండి తప్పించుకోవడం అంత తేలికా? జింక మెడను తన దృఢమైన దవడలతో గట్టిగా పట్టుకుంది ఆ పులి.జింక తప్పించుకోవడానికి పెనుగులాడుతుండగానే వీడియో పూర్తవుతుంది.ఇక ఈ దృశ్యాలను చూసిన నెటిజనం రకరకలుగా స్పందిస్తున్నారు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేయడం జరిగింది.కొంతమంది దీనిని చూసి ‘అది ఆకస్మిక దాడి, పాపం ఆ జింకకు తప్పించుకునే మార్గం దొరకలేదు’ అని జాలిపడుతూ కామెంట్ చేస్తే… మరికొందరు మాత్రం ‘ఆ చిరుత తెలివి, దాని వ్యూహం అమోఘం’ అంటూ కామెంట్ చేస్తున్నారు.







