వాట్సాప్( WhatsApp ) ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్ ను మరింత మెరుగు పరుస్తోంది.సరికొత్త సర్వీస్ లను అందిస్తూ ఆకట్టుకుంటుంది.
భారత్ తో పాటు చాలా దేశాలలో ఛానెల్స్( WhatsApp Channels ) ఫీచర్ లాంచ్ చేసింది.ఇక నచ్చిన సెలబ్రిటీలు, వ్యక్తులు, సంస్థల ఛానల్ ను ఫాలో అవుతూ వారికి సంబంధించిన అప్డేట్స్ అన్ని వాట్సాప్ లోనే తెలుసుకోవచ్చు.
పైగా ఫోన్ నెంబర్ తో పాటు ఇతర పర్సనల్ వివరాలు ఇవ్వకుండానే చానల్స్ ను ఫాలో అవ్వచ్చు.భద్రతపరంగా ఎలాంటి చింత అవసరం లేదు.
వాట్సప్ లోని కొత్త అప్డేట్స్ ట్యాబ్ లో ఛానెల్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.ఛానెల్స్ వన్-వే బ్రాడ్ కాస్ట్ కమ్యూనికేషన్( One Way Broadcast Communication ), కాబట్టి వాటిని క్రియేట్ చేసిన వ్యక్తులు మాత్రమే మెసేజ్లు పంపగలరు.వాట్సప్ ఛానెల్స్ కూడా గ్రూప్ చాట్ లాగానే ఉంటాయి.అయితే యజమాని మాత్రమే మెసేజ్ లను సెండ్ చేయడానికి వీలు ఉంటుంది.వాట్సప్ ఛానెల్ ను క్రియేట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం.
మొదట వాట్సప్ యాప్ ను అప్డేట్ చేయాలి.
తర్వాత హోం పేజీలో కనిపించే అప్డేట్స్ ట్యాబ్ పై నొక్కితే కింద ఛానెల్స్ ట్యాబ్ కనిపిస్తుంది.దాని పక్కనే ఉన్న ప్లస్+ బటన్ పై ట్యాప్ చేయాలి.
తరువాత క్రియేట్ ఛానల్ ఆప్షన్ పైన నొక్కాలి.చానెల్ కు ఒక పేరు, డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి.
కెమెరా ఐకాన్ ను నొక్కి ఫోన్ నుంచి ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుని ఛానల్ ఐకాన్ గా అప్లోడ్ చేసుకోవచ్చు.
అంతే కాదు ఛానల్ డిపి కోసం లైవ్ పిక్చర్ ఏమోజీలు( Whastapp Channel DP ) వెబ్ సెర్చ్ లను కూడా పిక్స్ చేసుకోవచ్చు.వివరాలు ఇచ్చాక క్రియేట్ ఛానల్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు చానల్ క్రియేట్ అయిపోయినట్టే.అడ్మిన్లు పబ్లిక్ ఛానల్లో ఫోటోలు, టెక్స్ మెసేజ్లు, లింక్స్ లేదా మరైతే ఏదైనా పోస్ట్ చేయవచ్చు.
తమ ఛానల్ ను ఎవరు ఫాలో అవ్వచ్చు ఎవరు ఫాలో కాకూడదు అని నిర్ణయము కూడా అడ్మిన్ తీసుకోవచ్చు.ఛానల్ అడ్మిన్ యూజర్ ఫోన్ నెంబర్ ప్రొఫైల్ కూడా ఫాలోవర్లకు కనిపించవు.
ఏ ఛానల్ ను ఫాలో అవుతున్నాము వారికి తెలియదు కాబట్టి భద్రతపరంగా చింతించాల్సిన అవసరం లేదు.