భారత్ – కెనడా మధ్య చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలోనే నిర్వహణ పరమైన కారణాలతో ఇవాళ్టి నుంచి భారతీయ వీసా సేవలు తదుపరి నోటీసులు వెలువడే వరకూ నిలిపివేసినట్లు భారత్ అధికారులు ధృవీకరించారు.
ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ సెంటర్ అయిన బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ నోటీసులో “కార్యాచరణ కారణాల వల్ల” వీసా సేవలు నిలిపివేయబడ్డాయని తెలిపింది.
మరోవైపు కెనడాలో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు భారత్ మార్గదర్శకాలకు జారీ చేసింది.
ఈ మేరకు అత్యవసర పరిస్థితుల్లో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని భారత పౌరులను కోరింది.ఈ మేరకు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే.







