Kishan Reddy: బిజెపిలో ఎంపీ,ఎమ్మెల్యే టికెట్ రావాలంటే ఆ అర్హత ఉండాల్సిందే ..!!

తెలంగాణలో ఎన్నికల కసరత్తు మొదలైంది.ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు దూకుడు పెంచేసాయి.

 Kishan Reddy To Get Mp And Mla Ticket In Bjp You Have To Have That Qualificatio-TeluguStop.com

తెలంగాణలో బిఆర్ఎస్( BRS ), కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ తప్పనిసరిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది.

ఈ ప్రకటన కూడా ఎంతో వ్యూహాత్మకంగా కేసీఆర్ ( KCR ) చేసినట్టు, ప్రతి నియోజకవర్గంలో రెండు నుంచి మూడు సర్వేలు చేయించి ఆ సర్వేల ఆధారంగానే 115 నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను కేటాయించడం జరిగిందని తెలుస్తోంది.ఈ విధంగా అధికార బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలి అంటే కెసిఆర్ ఎత్తులకు పైఎత్తులు తప్పనిసరిగా వేయాలి.

Telugu Bandi Sanjay, Bjp Mp, Congress, Kishan Reddy, Mla Tickets, Priyanka Gandh

ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ( Revanth reddy ) సమక్షంలో ఈసారి ఎలాగైనా బిఆర్ఎస్ ను ఓడించాలని అనేక కసరత్తులు చేస్తోంది.ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు కూడా నిర్వహించి అభ్యర్థుల లిస్టును తయారు చేసింది.కానీ అభ్యర్థులు ఎవరు అనేది ప్రకటించలేదు.ఈ తరుణంలో కాంగ్రెస్ బలం పెంచుకునేందుకు సీడబ్ల్యుసి మీటింగ్లనుంచి మొదలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటటువంటి పనుల గురించి అనేక హామీలు ఇచ్చింది.

Telugu Bandi Sanjay, Bjp Mp, Congress, Kishan Reddy, Mla Tickets, Priyanka Gandh

రాహుల్ గాంధీ,సోనియాగాంధీ( Sonia gandhi ) , ప్రియాంక,మల్లిఖార్జున కార్గే వంటి నాయకులను తెలంగాణకు తెప్పించి కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.ఈ విధంగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది.ఇదే తరుణంలో బిజెపి కూడా ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచిస్తుంది.ప్రతి నియోజకవర్గాల్లో ఫాలోయింగ్ ఉన్న అభ్యర్థులని నిలబెట్టాలని సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది.ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan reddy ) కీలకమైన ప్రకటన చేశారు.అసెంబ్లీ టికెట్ కావాలి అంటే సోషల్ మీడియాలో కచ్చితంగా 25వేల ఫాలోవర్స్ ఉండాలని, అలాగే లోక్ సభ టికెట్ కావాలంటే మినిమం పదివేల మంది ఫాలోవర్స్ ఉండాలనే కండిషన్స్ పెట్టనుందట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube