ముందస్తు పై ఎన్నికలపై...  జగన్ కు కేంద్రం లీకులు  ? 

ఏపీలో రానున్న రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై చాలాకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి .

 Center Leaks To Jagan On Early Elections , Jagan, Ap Cm Jagan, Jamili Elections-TeluguStop.com

కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉందనే హడావుడి జరుగుతుండగా, ఏపీలోనూ ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్ళబోతున్నారని,  పార్టీ శ్రేణులు అంతా సిద్ధంగా ఉండాలని, ఇప్పటికే అనేకసార్లు టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంటి వారు పార్టీ శ్రేణులకు సూచించారు .ఇక ఈ అంశంపై మొదట్లో వైసీపీ నాయకులు స్పందిస్తూ .ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ లేదని,  ఏపీలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని అనేది సార్లు క్లారిటీ ఇచ్చారు .ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం తర్వాత వైసిపి ప్రభుత్వం ఆయనకు విమర్శలు ఎదుర్కొంటుంది.అయితే ప్రజల్లో చంద్రబాబు అరెస్టుపై ( Chandrababu arrest )సానుభూతి లేదని, మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని , ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Jamili, Janasena, Janasenani, Pavan

తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,  అభివృద్ధి ఇవే తమను గెలిపిస్తాయని వైసిపి( YCP ) కీలక నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఇక నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడ్డాయి.

ఎన్నికల దిశగా ఆలోచన చేస్తున్న సమయంలో కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి అనే సంకేతాలు ఇచ్చారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముందుకు సాగే విధంగా ఏపీ క్యాబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు .

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Jamili, Janasena, Janasenani, Pavan

కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే,  దానికి అనుగుణంగానే ఏపీలో ఎన్నికలు వస్తాయని మంత్రులకు జగన్ ( CM jagan )సూచించారట.దీంతో కేంద్ర నుంచి ముందస్తు ఎన్నికలకు సంబంధించిన లీకులు జగన్ కు రావడంతోనే , ఈ విధంగా మంత్రులతో పాటు,  ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube