ఈ పెంపుడు తాబేలు సినిమాలు చూడటమే కాదు, వ్రతాలు కూడా చేస్తుంది!

సాధారణంగా పెంపుడు జంతువులు అనగానే మనకి కుక్కలు లేదంటే పిల్లుల గురించిన మాత్రమే ప్రస్తావన వస్తుంది.అయితే చాలా ప్రదేశాల్లో వివిధ రకాల జంతువులను పక్షులను పెంచుకుంటూ వుంటారు.

 Bhaskara Rao Pet Tortoise In Eluru Going Viral On Social Media Details, Eluru, T-TeluguStop.com

అంతేకాదండోయ్, వాటిని తమ కుటుంబ సభ్యుల్లా సాకుతారు కూడా.ఈ క్రమంలోనే కొంతమంది తాబేలుని( Turtle ) పెంచుకుంటూ వుంటారు.

అయితే ఈ ఉభయచరాన్ని పెంచడం ఒకింత కష్టమే.ఎందుకంటే వీటి పోషణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

తాబేలు అనేది నీటిలోనూ, నేలపైనా జీవించగలిగే జీవి.అందుకే దానిని ఉభయచరం అని అన్నారు.

Telugu Bhaskara Rao, Bhaskararao, Eluru, Member, Latest, Pet Turtle, Turtle-Late

కానీ మనదగ్గరే ఏలూరులో( Eluru ) ఒక వ్యక్తి తాబేలుని సొంత తన కుటుంబ సభ్యునిలాగే పరిగణించి పెంచుకోవటం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.వివరాల్లోకి వెళితే, ఏలూరుకు చెందిన భాస్కరరావుకు( Bhaskara Rao ) చిన్నతనం నుంచి పెంపుడు జంతువుల పెంపకం పట్ల చాలా ఆసక్తి.ఆ క్రమంలోనే ఆయనకు తాబేళ్లను పెంచడం అంటే హాబీగా పెట్టుకున్నాడు.ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఓ తాబేలును పెంచుతున్నారు.ఆ తాబేలు వారందరితో పాటు కలిసిపోయి కుటుంబ సభ్యులలో ఒకరిలా జీవిస్తుంది.

Telugu Bhaskara Rao, Bhaskararao, Eluru, Member, Latest, Pet Turtle, Turtle-Late

దానికి సుమారు 3 సంవత్సరాల వయసు వుంటుందని చెబుతున్నారు.వారు ఎక్కడికి వెళ్లినా ఇంటిలో వారి వెనుకనే తిరుగుతూ అది సందడి చేస్తుంది.కొత్త వారు ఎవరైనా ఇంటికి వస్తే వారిని వెంటనే గుర్తిస్తుంది కూడా.

కాగా భాస్కర్ రావు ఇప్పటివరకు మూడు తాబేళ్లను పెంచారు.అందులో ఒకటి 25 సంవత్సరాలు బ్రతికింది.

మరొకటి 11 సంవత్సరాలు బతికింది.మోటు అంటూ ముద్దుగా పిలుస్తూ పెంచుకున్న తాబేలు ఆయన ఇంట్లో 11 సంవత్సరాలు పెరిగింది.

మోటు వారికి వరలక్ష్మీ వ్రతం రోజున దొరకడంతో దానిని ఎంతో అదృష్టంగా భావించారు.వారు ఎక్కడికి వెళ్ళినా మోటును వెంట తీసుకెళ్లేవారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మోటు పాల్గొందట.అంతేకాకుండా వ్రత కథను వినడమే కాకుండా టీవీలో, లాప్ టాప్ లో సైతం వారితో కలిసి సినిమాలు చూసేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube