రాజమౌళి దెబ్బకు బాలీవుడ్ ఎప్పుడో కుదేలు అయిపోయింది.ఈమధ్య వారికి తమ సొంత కథలను సినిమాలు తీసుకునే స్తోమత లేకుండా పోతుంది.
అసలు బాలీవుడ్ దర్శకులకు పని కూడా లేకుండా పోయింది.అక్కడ కథలు రాయడం లేదు సినిమాలు సరిగ్గా తీయడం లేదు.
అందుకే బాలీవుడ్ హీరోలు అంత కూడా సౌత్ ఇండియన్ దర్శకుల మీద, లేకపోతే సౌత్ ఇండియన్ సినిమాల పైన రీమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారు.అలా అయినా హిట్టు కొడతారని గ్యారంటీ లేదు.మా సౌత్ సినిమాలు తీసుకెళ్లి అక్కడ దారుణంగా జోకర్ మూవీస్ లో మార్చేశారు అయితే మనం ఇప్పుడు రెండు సినిమాల గురించి కచ్చితంగా తెలుసుకొని తీరాలి.
క్వీన్ చిత్రం

కంగనా రనౌత్( kangana ranaut )హీరోయిన్ గా 2013లో వికాస్ బాల్ అనే దర్శకుడు తెరకెక్కించగా అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.కామెడీ డ్రామాగా తెరకెక్కిన క్వీన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది.అయితే ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధించింది అంటే ఇదే సినిమాను దాదాపు 5 సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ రీమేక్ చేశాయి.
దటీజ్ మహాలక్ష్మి( That Is Mahalakshmi ) అనే పేరుతో తమన్నా హీరోయిన్ గా ఈ చిత్రం రాగా తమిళ్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పారిస్ పారిస్ అనే పేరుతో తెరకెక్కింది.ఇక పరుల్ యాదవ్ హీరోయిన్ గా బటర్ ఫ్లై పేరుతో కన్నడలో ఈ చిత్రం రీమేక్ చేయబడగా మలయాళం లో మంజీమా మోహన్ హీరోయిన్ గా జాం జాం అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం.ఇలా ఒక బాలీవుడ్ సినిమా నాలుగు భాషల్లో రీమేక్ కావడం అనేది ఈ సినిమాతోనే సాధ్యమైంది.
పింక్ మూవీ

అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రలో, తాప్సీ మరియు మరో ఇద్దరు నటీమణులు కలిసి నటించిన సినిమా పింక్.ఈ సినిమా 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది అంతేకాదు ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషలో రీమేక్ కూడా చేయబడగా అవి కూడా విజయాన్ని సాధించడం విశేషం దీన్ని తెలుగులో వకీల్ సాబ్ ( Pink )పేరుతో 2022 లో పవన్ కళ్యాణ్ రీమేక్ చేసి హిట్టు కొట్టారు.2019 లో పవన్ కళ్యాణ్ కన్నా ముందే అజిత్ తమిళ్లో ఈ చిత్రాన్ని తీయగా అక్కడ కూడా అది సంచలన విజయాన్ని సాధించింది ఇలా మరో బాలీవుడ్ చిత్రం రీమేకులతో కూడా హిట్టు కొట్టడం అనేది పింక్ మూవీ తోనే సాధ్యమైంది.







