టిడిపి ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా ? 

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ ఉంది.ఇప్పటికే ఏపీతో పాటు దేశ, విదేశాల్లో చంద్రబాబు అరెస్టును( Chandrababu arrest ) నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే .

 Mass Resignation Of Tdp Mlas , Chandrababu, Jagan, Ap Cm Jagan, Ysrcp, Chan-TeluguStop.com

ఇక ఎక్కడికక్కడ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దీక్షలు చేపట్టారు.ప్రస్తుతం ఆయన బెయిల్ ప్రయత్నాలు జరుగుతున్నా, అవి వచ్చే అవకాశం లేదని,  మరికొంత కాలం పాటు చంద్రబాబు జైల్లోనే ఉంటారనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పుడు ఈ అరెస్టు వ్యవహారాన్ని సానుభూతిగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో టిడిపి అనేక వ్యూహాలు రచిస్తోంది .

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Tdp Mlas, Ysrcp-Latest News - Telugu

దీనిలో భాగంగానే టిడిపి( TDP ) ఎమ్మెల్యేలంతా మూకమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట.చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ,  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత టిడిపి ఎమ్మెల్యేలంతా( TDP mlas ) రాజీనామా చేసి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ఈ రాజీనామాలు చేస్తారా లేక రెండో రోజు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు పట్టు పట్టి , అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రాజీనామా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం టిడిపి ఎమ్మెల్యేల్లో ఉందట.

దీనిపై ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Tdp Mlas, Ysrcp-Latest News - Telugu

ఎమ్మెల్యేలతో పాటు టిడిపికి ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేసి జాతీయస్థాయిలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఫోకస్ పడే విధంగా చేస్తే మంచిదని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.రాజీనామా చేయడంతో పాటు , రాష్ట్రమంతా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బస్సుయాత్ర చేపట్టి,  ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి,  దాన్ని సానుభూతిగా మార్చుకోవాలనే ఆలోచనకు టిడిపి ఎమ్మెల్యే లు  వచ్చినట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube