టిడిపి ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా ? 

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ ఉంది.

ఇప్పటికే ఏపీతో పాటు దేశ, విదేశాల్లో చంద్రబాబు అరెస్టును( Chandrababu Arrest ) నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే .

ఇక ఎక్కడికక్కడ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ దీక్షలు చేపట్టారు.ప్రస్తుతం ఆయన బెయిల్ ప్రయత్నాలు జరుగుతున్నా, అవి వచ్చే అవకాశం లేదని,  మరికొంత కాలం పాటు చంద్రబాబు జైల్లోనే ఉంటారనే ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పుడు ఈ అరెస్టు వ్యవహారాన్ని సానుభూతిగా మార్చుకుని వచ్చే ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతో టిడిపి అనేక వ్యూహాలు రచిస్తోంది .

"""/" / దీనిలో భాగంగానే టిడిపి( TDP ) ఎమ్మెల్యేలంతా మూకమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట.

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ,  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత టిడిపి ఎమ్మెల్యేలంతా( TDP Mlas ) రాజీనామా చేసి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ఈ రాజీనామాలు చేస్తారా లేక రెండో రోజు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై చర్చకు పట్టు పట్టి , అసెంబ్లీ సమావేశాల చివరి రోజున రాజీనామా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం టిడిపి ఎమ్మెల్యేల్లో ఉందట.

దీనిపై ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. """/" / ఎమ్మెల్యేలతో పాటు టిడిపికి ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేసి జాతీయస్థాయిలో చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఫోకస్ పడే విధంగా చేస్తే మంచిదని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.

రాజీనామా చేయడంతో పాటు , రాష్ట్రమంతా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ బస్సుయాత్ర చేపట్టి,  ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి,  దాన్ని సానుభూతిగా మార్చుకోవాలనే ఆలోచనకు టిడిపి ఎమ్మెల్యే లు  వచ్చినట్టు సమాచారం.

.

దర్శకుడు హరీష్ శంకర్ పై పెరుగుతున్న ఒత్తిడి.. ఉస్తాద్ తో లక్ష్యాన్ని సాధిస్తాడా?