అందరి ముందు జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు... సీరియస్ లుక్ ఇచ్చిన నటి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మోహన్ బాబు ( Mohan Babu ) ఒక్కరు.మోహన్ బాబు అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అనే విషయం మనకు తెలిసిందే .ఈయన ఎక్కడ ఉన్నా కూడా తనతో పాటు తన చుట్టుపక్కల వారు కూడా అదే క్రమశిక్షణతో ఉండాలని భావిస్తూ ఉంటారు.ఇకపోతే మోహన్ బాబు తాజాగా ఏఎన్నార్( ANR ) శత జయంతి వేడుకలలో భాగంగా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే ఇలా ఏఎన్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు అనంతరం వేదికపై ఏఎన్ఆర్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.

 Mohan Babu Serious About Jayasudha At Anr Event, Jayasudha,mohan Babu, Anr, Phon-TeluguStop.com
Telugu Anr Idol, Jayasudha, Mohan Babu, Nagarjuna, Phone-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ నటి జయసుధ (Jayasudha ) కూడా హాజరయ్యారు జయసుధ ఏఎన్ఆర్ గారితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి జయసుధ కూడా హాజరై సందడి చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జయసుధ వెళ్లి మోహన్ బాబు గారి పక్కన కూర్చున్నారు.అయితే వేదికపై ప్రముఖ వ్యక్తులు స్పీచ్ ఇస్తున్నటువంటి సమయంలో జయసుధకు బోర్ కొట్టి బహుశా ఫోన్ తీసుకుందో లేక ఏదైనా ఇంపార్టెంట్ కావడంతో ఫోన్ (Phone ) చూస్తుందో తెలియదు కానీ ఆమె ఫోన్ చేతిలో పట్టుకొని చూస్తూ కూర్చున్నారు.

Telugu Anr Idol, Jayasudha, Mohan Babu, Nagarjuna, Phone-Movie

ఇలా జయసుధ ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చోవడంతో అది గమనించినటువంటి మోహన్ బాబు ఒక్కసారిగా జయసుధ చేతుల్లో నుంచి ఫోన్ లాగేసుకున్నారు.మోహన్ బాబు తన చేతిలో నుంచి ఫోన్ లాక్కోవడంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి జయసుధ మోహన్ బాబు వంక సీరియస్ లుక్ ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్( Viral Social Media ) అవుతున్నాయి.ఈ ఫోటోల పై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ….ఇంటివారికే కాదు ఇండస్ట్రీకి కూడా మోహన్ బాబు పెదరాయుడే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube