తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి నటులు అయినా సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )లాంటి దిగ్గజ నటుడు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేస్తూ వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ కొడుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇక ఇదే టైంలో చాలామంది నటులు ఇండస్ట్రీకి వచ్చి హీరోలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ కి డుప్ గా నటించే నటుడు ఎవరంటే కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) గారనే చెప్పాలి.
ఆయన సీనియర్ ఎన్టీఆర్ చేసిన చాలా సినిమాలకి డూప్ గా నటించాడు.ఇక ఆ తర్వాత తను కూడా నటుడుగా మారి ఎన్టీఆర్ సినిమాల్లోనే విలన్ గా కూడా నటించాడు.
అయితే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో ఎన్టీఆర్ కి సత్యనారాయణకి మధ్య ఒక చిన్న గొడవ జరిగిందనే విషయం అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయింది.

నిజానికి వీళ్ళ మధ్య గొడవ జరిగిందా అంటే ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు సత్యనారాయణ విలన్ గా, ఎన్టీఆర్ హీరోగా ఆ సినిమాలో చేస్తున్నారు.అలాంటి సందర్భంలో సీన్ కి సీన్ కి మధ్య బ్రేక్ టైం లో ఎన్టీఆర్, సత్యనారాయణ మధ్య గొడవ జరుగుతుండడం సినిమా యూనిట్ చూశారు అదేంటి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.కానీ తీరా చూస్తే అది నెక్స్ట్ తీయబోయే సీన్ కి సంబంధించిన సీన్ రిహార్సల్ చేస్తూ ఉన్నారు అది చూసిన సినిమా యూనిట్ మొత్తం ఒక వంతుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఎందుకంటే ఇద్దరీ మధ్య నిజంగానే ఏదైనా గొడవ జరిగిందేమో అని కంగారుపడ్డారు.కానీ అది సినిమాకు సంబంధించిన రిహార్సల్ సీన్( scene Rehearsal ) అని తెలిసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్న్నారు.
నిజానికి సీనియర్ ఎన్టీఆర్, కైకాల సత్యనారాయణ కి మధ్య మంచి అనుభందం ఉండేది.అందుకే సత్యనారాయణ సీనియర్ ఎన్టీఆర్ ని అన్నయ్య అంటూ పిలుస్తూ ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించేవాడు…








