టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన తాజా చిత్రం సలార్.( Salaar ) ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఎట్టకేలకు ఈ సినిమాను ఈనెల 28వ తేదీన విడుదల చేయాలని మూవీ మేకర్స్ ముందుగానే అనుకున్నారు.అభిమానులకు షాకిస్తూ మరొకసారి విడుదల తేదీని వాయిదా వేశారు.
ఒకవేళ విడుదల తేదీ వాయిదా వేయకపోయి ఉంటే ఈపాటికి సెప్టెంబర్ 28న సినిమా విడుదల కావడానికి రెడీగా ఉండేది.మూవీ మేకర్స్ కూడా ఈపాటికి ప్రమోషన్స్ ని షురూ చేసేవారు.
కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు.పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు.అటు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ వారు గానీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు.
ఇకపోతే తాజాగా అందిన సమాచారం ప్రకారం సలార్ సినిమా నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో ఆడియెన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే అక్టోబర్ 23 వరకు వేచి చూడాల్సిందే.
ఎందుకంటే ఆ రోజు ప్రభాస్ బర్త్ డే( Prabhas Birthday ) ఉంది.కాబట్టి ఆరోజే సలార్ కొత్త రిలీజ్ డేట్ పై అఫిషీయల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇకపోతే తాజాగా అందిన సమాచారం మేరకు.అక్టోబర్ 23న సలార్ ట్రైలర్( Salaar Trailer ) రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది.ఇన్ని రోజులు వినిపించిన డేట్స్ అన్ని రూమర్సే అయినా ఈసారి మాత్రం ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా సలార్ ట్రైలర్ రావడం గ్యారెంటీ అని తెలుస్తోంది.అదే రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ ఉండనుంది.
మామూలుగానే ఆ రోజు ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి.ఈ మేరకు అక్టోబర్ 23 కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్.
మరి టీజర్‌తో డిజిటల్ రికార్డ్స్‌ని చెల్లా చెదురు చేసిన సలార్ ట్రైలర్‌తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.







