బాలయ్య అన్ స్టాపబుల్ 3 నుంచి బిగ్ అప్డేట్?

తెలుగు బుల్లితెరపై ఎన్నో టాక్ షోలు ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.అయితే ఆహా వేదికగా బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాఫబుల్ (Un Stoppable) కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.

 Big Update Goes Viral About Balakrishna Unstoppable 3 Talk Show, Balakrishna, K-TeluguStop.com

ఇలా బాలయ్య వ్యాఖ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిని తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.ఇక మొదటి సీజన్లో అందరూ సెలబ్రిటీలు రాగా రెండవ సీజన్లో మాత్రం కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు.

రెండవ సీజన్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరైన విషయం మనకు తెలిసిందే.

Telugu Balakrishna, Pawan Kalyan, Tollywood, Unstoppable-Movie

ఇలా సినిమా సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.దీంతో ఈ కార్యక్రమం పై ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు.ఇకపోతే రెండవ సీజన్ పూర్తి అయ్యి మూడవ సీజన్ త్వరలోనే ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చారు.ఇక మెగా ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు.ఇక రామ్ చరణ్( Ramcharan ) ఈ కార్యక్రమానికి రాకపోయినా ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Pawan Kalyan, Tollywood, Unstoppable-Movie

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ కార్యక్రమం మూడవ సీజన్ ప్రసారానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

చిరంజీవి(Chiranjeevi ) కాల్ షీట్స్ దొరికిన వెంటనే ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారని ఆయన ఎపిసోడ్ తోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.ఇక చిరంజీవి మాత్రమే కాకుండా ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి మినిస్టర్ కేటిఆర్( KTR ) కూడా హాజరు కాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనే విషయం తెలియాలి అంటే ఆహా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube