కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అట్లీ ( Atlee ) ఒకరు.ఈయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఇక తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ హీరోగా జవాన్ ( Jawan Movie ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అట్లీ ఈ సినిమా ద్వారా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి విజయం కావడంతో ఈయన వరుస సినిమా ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను తెలియచేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్( Shahrukh Khan ) తో సినిమా చేసి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అట్లీ తన తదుపరి సినిమాల గురించి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరోతో అయినా సినిమా చేయాలని ఉందా అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నలుగురు హీరోలను డైరెక్ట్ చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను సల్మాన్ ఖాన్ , హృతిక్ రోషన్ ,రణబీర్ కపూర్ ,రణవీర్ సింగ్ ఈ నలుగురు హీరోలను డైరెక్ట్ చేయాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.
ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అవుతున్నాయి.ఈయన సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.తాను ఒక సినిమా చేస్తున్నాను అంటే ఆ సినిమాకి రచయితగా డైరెక్టర్ గా పని చేస్తున్నాను అని ఎప్పుడు కూడా ఫీలవను.తాను ఒక అభిమానిగా సినిమా చేస్తున్నానని ఫీల్ అవుతానని అదే నా సినిమాని సక్సెస్ అయ్యేలా ముందుకు నడిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా అట్లీ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరి బాలీవుడ్ ఈ నలుగురు హీరోలు అట్లీకి అవకాశం ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.