భారత్ ను రెచ్చగొట్టడం లేదు కలిసి పని చేస్తాం: కెనడా ప్రధాని

గత కొన్ని నెలలుగా భారత్-కెనడా సంబంధాలు దిగజారుతున్న విషయం తెలిసిందే .ఖలిస్తాన్ సానుభూతిపరుడు హరదీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యపై భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూ డో( Justin Trudeau ) గత జూన్ లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 Not Provoking India, We Will Work Together: Canadian Pm ,justin Trudeau , Hardee-TeluguStop.com

దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.అయితే ఈ హత్య తర్వాత రెండు దేశాల రాజకీయ సంబంధాలు విదేశీ విదేశాంగ విధానం బాగా దెబ్బతింది.

దీనికి కొనసాగింపుగా భారత దౌత్య వేత్త ను బహిష్కరించిన కెనడా ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది.దాంతో భారత్ కూడా ఘాటుగానే స్పందించింది.

Telugu Canada, Canadian Pm, Hardeepsingh, India, Justin Trudeau, Khalistan, Nare

కెనడా( Canada ) రాయబారిని దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించింది.మరో ఐదు రోజుల్లో భారత్ను విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది .దాంతో ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఏర్పడింది.ఈ ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపిస్తాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు కెనడా ప్రధాని నష్ట నివారణ చర్యలకు పూనుకున్నట్లుగా మరో ప్రకటన చేశారు.భారత్ తో తాము ఉద్రిక్తతలను కోరుకోవడం లేదని అయితే ఖలిస్తాన్ నేత హత్య ఉదంతం పై తీవ్ర స్థాయి విచారణ జరగాలని కోరుకుంటున్నామని అన్ని సక్రమంగా ఉన్నాయని నమ్మకం కలిగేందుకు భారత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ప్రకటించారు .

Telugu Canada, Canadian Pm, Hardeepsingh, India, Justin Trudeau, Khalistan, Nare

అయితే ఈ రెండు దేశాల వ్యాపార సంబంధాలను చూస్తే సమాన స్థాయిలోనే ఉండటం అంతేకాక కెనడా మద్దతు లేకపోయినా ఇతర దేశాల నుంచి ఆయా వస్తువులను దిగుమతి చేసే అవకాశం ఉండడంతో భారత్ కూడా ఈ దేశంతో సంబంధాలపై కఠినంగానే వ్యవహరిస్తుంది.అయితే ప్రపంచం మార్కెట్ల కు అతిపెద్ద వినియోగదారుగా ఉన్న భారత్ వంటి దేశాలతో సున్నం పెట్టుకోవడం అనవసరం అనుకున్నారో ఏమోగానీ కొంత రాజీ దొరణీలోనే కెనడా ప్రధాని మాట్లాడటం విశేషం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube