యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR )హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దేవర”..
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ సినిమానే చేస్తున్నాడు.దీంతో ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా( RRR movie ) ఇచ్చిన గ్లోబల్ ఇమేజ్ ను పెంచుకుంటూ ముందుకు పోతున్నాడు.

”దేవర’‘( Devara ) సినిమాపై అప్పుడే హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది.ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అండ్ టీమ్ చాలా కష్ట పడుతున్నారు.కొరటాల ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో హాలీవుడ్ రేంజ్ లో భారీ హంగులతో తెరకెక్కిస్తున్నాడు.
చాలా రోజుల నుండి మేకర్స్ క్రేజీ సీక్వెన్స్ షూట్ చేయడంలో బిజీ బిజీగా ఉంది.ఈ క్రేజీ సీక్వెన్స్ ను అండర్ వాటర్ లో షూట్ చేసారు.

కాగా ఎన్టీఆర్ సైమా ( Siima Awards )వేడుకల కోసం దుబాయ్ వెళ్లడంతో షూట్ కు బ్రేక్ పడింది.ఇక దుబాయ్ నుండి ఎన్టీఆర్ తిరిగి రావడంతో ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు క్లారిటీ వచ్చింది.రేపటి నుండి మరో యాక్షన్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ బిజీ కానున్నారట.సాల్మన్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సీక్వెన్స్ రేపు చిత్రీకరించ బోతున్నారని టాక్.ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మాత్రమే కాదు, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్ లపై కూడా షూట్ జరగబోతున్నట్టు తెలుస్తుంది.లెన్తీ షెడ్యూల్స్ ప్లాన్ చేయడంతో ఈ షూట్ వేగంగా పూర్తి అవుతుంది.
కాగా యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా.విలన్ గా సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వబోతుంది.







