పార్లమెంట్ కొత్త భవనంపై కేంద్రం గెజిట్ విడుదల

పార్లమెంట్ నూతన భవనాన్ని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.ప్రస్తుత పార్లమెంట్ కు తూర్పున కొత్తగా నిర్మించిన భవనమే ఇకపై పార్లమెంట్ హౌజ్ ఆఫ్ ఇండియాగా కొనసాగనుంది.

 Center Gazette Release On New Building Of Parliament-TeluguStop.com

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది.ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.భారత పార్లమెంట్ గొప్ప వారసత్వాన్ని స్మరించుకుంటూ 2040 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్ప కార్యక్రమంను కేంద్రం నిర్వహించనుంది.

మరోవైపు ఇవాళ్టి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా మధ్యాహ్నం ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో కలిసి ఎంపీలు సభలో అడుగు పెట్టనున్నారు.మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్ సభ, మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్యసభ ప్రారంభంకానుంది.ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులకు కేంద్రం ప్రత్యేక కానుక ఇవ్వనుంది.

జనపనారతో రూపొందించిన బ్యాగులను కేంద్రం సభ్యులకు అందించనుంది.పాత, కొత్త పార్లమెంట్ భవనాల చిత్రాల స్టాంపులతో పాటు స్మారక నాణెం ఉన్న బ్యాగులను అందించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube