తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్( Telugu Entertainment Channels )లో స్టార్ మా, ఈటీవీ, జీ తెలుగు, జెమినీ టీవీ ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి.స్టార్ మా ఛానల్‌కి రియాలిటీ షోలు, సీరియళ్లు మంచి బలంగా నిలుస్తుంటాయి.
ఇవి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండటం వల్ల జనాలు ఈ ఛానల్ ఎక్కువగా చూస్తుంటారు.అందుకే అది టీఆర్‌పీ రేటింగ్స్‌లో ముందంజలో ఉంటుంది.
కార్తీకదీపం ఫిక్షనల్ సీరియల్ ఎంత బాగా హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.ఈ సీరియల్ వల్ల స్టార్ మా( Star Maa ) ఓ రేంజ్ లో రేటింగ్స్ దక్కించుకుంది.
ఇంకా ఇలాంటి మరిన్ని సీరియల్ ఆ ఛానల్ ను టాప్ ప్లేస్ లో నిలబెడుతున్నాయి.అయితే ఇటీవల జీ తెలుగు అనూహ్యంగా దానిని నెట్టేసి ఫిక్షనల్ కేటగిరీలో నెంబర్ వన్ గా నిలిచింది.

ఫిక్షనల్ కేటగిరీలో 666 రేటింగ్‌తో జీ తెలుగు( Zee Telugu ) నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచింది.త్రినయని, ప్రేమ ఎంత మధురం వంటి జీతెలుగు సీరియళ్లు బాగానే పాపులర్ అయ్యాయి కానీ అవి స్టార్ మా సీరియళ్లతో పోలిస్తే వెనుకంజలోనే ఉన్నాయి.అయినా జీ తెలుగు ఈ కేటగిరీలో ఎక్కువ రేటింగ్స్ పొంది ఆశ్చర్యపరుస్తోంది.అయితే ఇది ఆ ఘనతను పెద్దగా సెలబ్రేట్ చేసుకోకపోవడం గమనార్హం.ఇక ఈ కేటగిరీలో స్టార్ మా 581 రేటింగ్‌తో సెకండ్ ప్లేస్ లో నిలుస్తుంది.బ్రహ్మముడి వంటి సీరియల్స్‌తో స్టార్ మా యాజమాన్యం టాప్ ప్లేస్‌కి రావాలని యోచిస్తోంది.
ఇకపోతే జెమినీ టీవీ( Gemini ) ఈ విభాగంలో చాలా తక్కువ 43 స్కోరుతో లాస్ట్ ప్లేస్ లో ఉంది.ఈటీవీ 177 రేటింగ్ సంపాదించింది.
ఈటీవీ ప్రముఖ ఛానలే అయినప్పటికీ స్టార్ మా జీ తెలుగు లకు ఇది చాలా దూరంలో ఉండిపోయింది.

ఇక నాన్ ఫిక్షనల్ కేటగిరీ( Non Fiction Category )కి వస్తే స్టార్ మా 207 రేటింగ్‌తో నెంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోగా ఈటీవీ 137 రేటింగ్‌తో సెకండ్ ప్లేస్ కొట్టేసింది.స్టార్ మా బిగ్‌బాస్ వల్ల నాన్-ఫిక్షనల్ లేదా రియాలిటీ కేటగిరీలో టాప్ ప్లేస్ లో నిలిచినట్లు తెలుస్తోంది.ఈటీవీ జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి రియాలిటీ షోలతో నాన్-ఫిక్షనల్ కేటగిరీలో సెకండ్ ప్లేస్ తెచ్చుకుంది.
ఈ విభాగంలో జీ తెలుగు 71 రేటింగ్‌తో మూడవ స్థానంలో ఉండగా, జెమినీ టీవీ కేవలం రెండు రేటింగ్ తో అత్యంత దిగువ స్థాయిలో నిలిచిపోయింది.అయితే జెమిని మూవీస్ కేటగిరీలో మాత్రం 178 రేటింగ్‌తో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది.
ఒకప్పుడు నెంబర్ వన్ ఛానల్ గా ఉన్న జెమినీ ఇలా పడిపోవడానికి యాజమాన్యం దానిని పట్టించుకోకపోవడమేనని తెలుస్తోంది.







