హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ విజయవంతం అయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.70 ఏళ్ల తరువాత తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయని తెలిపారు.
ఈ క్రమంలో సమావేశాలను సక్సెస్ చేసిన పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై చర్చించడం జరిగిందన్నారు.అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించిందన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను ప్రజలకు ఇస్తామన్నారు.గతంలోనూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గుర్తు చేశారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.ఈ క్రమంలోనే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలనపై, ప్రస్తుత బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని చూడాలని ప్రజలను కోరారు.
ఎవరెన్నీ విమర్శలు చేసినా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







