కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని భావించే వాళ్లకు కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్ట్ లభిస్తే సులభంగా సక్సెస్ దక్కుతుంది.అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుంచే ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
కూలిపని చేస్తూ ఐఏఎస్ గా విజయం సాధించిన శివగురు ప్రభాకరన్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది.ఇంజనీర్ కావాలని అనుకున్న శివగురు ప్రభాకరన్ చెన్నైలో( Sivaguru Prabhakaran in Chennai ) కౌన్సిలింగ్ కు వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
తండ్రి తాగుబోతు కావడంతో శివగురు ప్రభాకరన్ పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.తంజావూరు జిల్లా మెలోట్టంకాడుకు( Melottankadaku ) చెందిన ప్రభాకరన్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభాకరన్ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు.యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంక్ సాధించి ప్రభాకరన్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్( St.Thomas Mount Railway Station ) నుంచి ఐఐటీ మద్రాస్ కు చేరుకుని అక్కడ చదువు పూర్తైన తర్వాత ప్రభాకరన్ ఎంతో కష్టపడి కెరీర్ విషయంలో సక్సెస్ అయ్యారు.రెండు సంవత్సరాల పాటు ప్రభాకరన్ కరెంట్ కోత యంత్రం ఆపరేటర్ గా పని చేయడం జరిగింది.ఒకానొక దశలో ప్రభాకరన్ పొలం పనులు కూడా చేశారు.ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా ప్రభాకరన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

నాలుగో ప్రయత్నంలో ప్రభాకరన్ సివిల్స్ లో ర్యాంక్ సాధించడం జరిగింది.ప్రభాకరన్ ఐఏఎస్ ఆఫీసర్ గా తిరునెల్వేలి సబ్ కలెక్టర్ గా పని చేశారు.ప్రభాకరన్ ఒక డాక్టర్ ను పెళ్లి చేసుకున్నారు.
రెండు రోజులు పేదలకు ఉచిత వైద్యం అందించాలనే షరతు మీద ప్రభాకరన్ వైద్యురాలిని పెళ్లి చేసుకున్నారు.ప్రభాకరన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు.








