యూట్యూబ్ వీడియోల ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో హర్షసాయి ( Harsha sai )ఒకరు.హర్షసాయి నటిస్తున్న మెగా సినిమా టీజర్ తాజాగా విడుదల కాగా ఈ టీజర్ కు 3.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఈ వ్యూస్ తెలుగు వెర్షన్ టీజర్ వ్యూస్ కాగా ఇతర భాషల్లో కూడా మెగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.
ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకు రచయిత, డైరెక్టర్ కూడా హర్షసాయి ( Harsha sai ) కావడం గమనార్హం.2024 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా హర్షసాయికి భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న నేపథ్యంలో హర్షసాయి పాన్ ఇండియా హీరో కావడం సాధ్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హర్షసాయి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హర్షసాయి ( Harsha sai )సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో కొత్త తరహా కథలను, కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు.
హర్షసాయి సినిమాల్లో సక్సెస్ కావాలని మరెంతో మందికి ఆయన సహాయం చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హర్షసాయి సినిమాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

సరైన ప్లానింగ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే హర్షసాయి ( Harsha sai )దూకుడుకు బ్రేకులు వేయడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హర్షసాయికి సోషల్ మీడియాలో( Social media ) సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.హర్షసాయి మెగా సినిమాకు పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.కొంతమంది హర్షసాయిపై నెగిటివిటీ క్రియేట్ చేయాలని భావిస్తున్నా హర్షసాయిని దగ్గరి నుంచి చూసిన వాళ్లు మాత్రం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని హర్షసాయి మంచి వ్యక్తి అని చెబుతున్నారు.







