రజాకార్లపై పోరాటంలో బీజేపీ ఎక్కడుంది.?: సీపీఐ నేత డి. రాజా

హైదరాబాద్ లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.

 Where Is Bjp In The Fight Against Rajakars?: Cpi Leader D. Raja-TeluguStop.com

రాజా మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.

కమ్యూనిస్టులు ముందు నిలబడిన తరువాతే స్వాతంత్య్రం సిద్ధించిందని డి.రాజా తెలిపారు.రజాకార్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కమ్యూనిస్టులు పోరాటం చేశారని పేర్కొన్నారు.

కమ్యూనిస్టులు ఎన్నో త్యాగాలు చేశారన్న ఆయన రజాకార్లపై జరిపిన పోరాటంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు.కేవలం రాజకీయ లబ్ధి కోసమే దేశం పేరు మార్పును తెరపైకి తెచ్చారని విమర్శించారు.

దేశం కష్టాల్లో ఉందని, రూపాయి విలువ పడిపోతుందని పేర్కొన్నారు.మణిపుర్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా ఎందుకు అల్లర్లు జరిగాయని ప్రశ్నించారు.

అంతేకాకుండా గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube