సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గంలో ఉన్న బీసీలకు బీసీ బందు పథకం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వ అందించిన బీసీ బంధు పథకం ప్రతి ఒక్క నీరు పేద బీసీకి అందాలని కానీ,కోదాడలో దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు.
నిజమైన నిరుపేద కుటుంబానికి ఎందుకు ఇవ్వడం లేదని, రాష్ట్ర పథకాలు బీఆర్ఎస్ పథకాలుగా మారాయని మండిపడ్డారు.గుడిబండ లో దళిత బంధువు పథకంలో దళితులను మోసాలు చేశారని, దళితులు నన్ను ఆశ్రయించారని తెలిపారు.
వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని,బీసీ బంధు పథకం కూడా ప్రతి ఒక్క నిరుపేద బీసీలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.