వాట్సాప్ చాటింగ్ మధ్యలో అడ్వర్టయిజ్మెంట్లు.. దీనిపై మెటా స్పందన ఇదే

వాట్సాప్( WhatsApp ) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్.మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ దీనిని కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.

 No Ads Will Appear On Screens Confirms Whatsapp Chief,whatsapp Chat,whatsapp,wi-TeluguStop.com

ఇది ఇప్పటికీ ఉచిత ప్లాట్ఫారమ్గా ఉంది.కానీ ఇప్పుడు జుకర్బర్గ్ దీనిని పెయిడ్ ఆధారిత యాప్గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వాట్సాప్ ఇప్పుడు చెల్లింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలో మీరు వాట్సాప్ చాట్( WhatsApp Chat )ల మధ్యలో ప్రకటనలను చూడటం ప్రారంభించవచ్చు.

అంటే ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్ వంటివి చూస్తున్నప్పుడు మధ్యలో మీకు యాడ్స్ కనిపిస్తాయి.ఆ ప్రకటనల వల్ల ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లకు ఆదాయం సమకూరుతుంది.

ఇదే తరహాలో వాట్సాప్ కూడా ఇలా ప్రకటనలను తన ప్లాట్ఫారమ్లో త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.తద్వారా కోట్లాది రూపాయలను దీని ద్వారా సంపాదించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

దీనిపై ఇటీవల ఓ మీడియా నివేదికను వెల్లడించింది.

Telugu Meta, Whatsapp, Whatsapp Chat, Cathcart-Technology Telugu

ఈ వార్తలను వాట్సాప్ చీఫ్ విల్ క్యాత్కార్ట్( Will Cathcart ) తిరస్కరించారు.విల్ క్యాత్కార్ట్ ఈ నివేదిక అబద్ధమని, తాము దీన్ని చేయడం లేదని చెప్పారు.విల్ ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

వాట్సాప్ చాట్ స్క్రీన్పై కాంటాక్ట్స్తో సంభాషణల జాబితాలో ప్రకటనలను చూపించాలా వద్దా అని మెటా బృందాలు చర్చిస్తున్నాయని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. మెటా బృందం( Meta Team ) యాడ్-ఫ్రీ వెర్షన్ కోసం సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేయాలా వద్దా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది.

అలా జరిగితే మీరు యాడ్ ఫ్రీ వాట్సాప్ని ఉపయోగించడానికి డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.ఇలా రాయిటర్స్ నివేదికను ప్రచురించింది.

Telugu Meta, Whatsapp, Whatsapp Chat, Cathcart-Technology Telugu

ఈ నివేదికపై మెటా వెంటనే స్పందించలేదు.వాట్సాప్, మెసెంజర్ యాప్లలో చాట్ జీపీటీ( ChatGpt ) లాంటి చాట్బాట్లను చేర్చబోతున్నట్లు జూన్లో మెటా తెలిపింది.వాట్సాప్ను లభదాయకమైన ఉత్పత్తిగా మార్చడానికి మెటా సిద్ధమవుతోందని ఈ నెల ప్రారంభంలో బిజినెస్ యాప్కు సంబంధించి వార్తలు వచ్చాయి.వాట్సాప్ ఇండియా మరియు బ్రెజిల్లలో తన సర్వీస్ ఫీజు ఆధారితంగా చేయడానికి యోచిస్తున్నట్లు నివేదికలో చెప్పబడింది.

రుసుము ఆధారిత చాటింగ్ సేవ కేవలం వాట్సాప్ బిజినెస్ ఖాతాకు మాత్రమే ఉంటుంది, అంటే మీరు వాట్సాప్ బిజినెస్( WhatsApp Business ) యాప్ ద్వారా చాటింగ్ చేయడానికి మాత్రమే చెల్లించాలి.ప్రస్తుతానికి మెటా దీనిని ఖండించినా త్వరలో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube