ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గడిచిన వారం రోజుల్లో ఒక్కసారిగా ఎలా మారిపోయాయి మనమంతా చూస్తూనే ఉన్నాం.అసలు ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )ని ‘స్కిల్ డెవలప్మెంట్’ కేసు లో అరెస్ట్ చేసి రాజముండ్రి జైలు లో రెండు వారాల పాటు రిమాండ్ లో ఉంచడం.
ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )చంద్రబాబు నాయుడు ని జైలు లో కలిసి 45 నిమిషాల పాటు భేటీ అయ్యి , ఆ తర్వాత మీడియా సమక్షం లో పొత్తుని అధికారికంగా ప్రకటించడం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి.జనసేన పార్టీ ఈ కూటమి నుండి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ, త్యాగాలకు మాత్రం ఈసారి మా పార్టీ సిద్ధంగా లేదని పవన్ కళ్యాణ్ ఇది వరకే ప్రకటించాడు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఏమిటి అనేది కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు కూటమి కి ముఖమైన ఫేస్ మాత్రం పవన్ కల్యాణే, ఆయన ప్రసంగాలు, అలాగే ఆయన చరిష్మా మీదనే కూటమి అడుగులు వెయ్యాలి.అన్నీ ప్లాన్ ప్రకారం పెర్ఫెక్టుగా కూటమి ని ప్లాన్ చేస్తే, 2024 ఎన్నికలలో ప్రభంజనం సృష్టించడం మాత్రం ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.వాళ్ళ అంచనా ప్రకారం కోస్తాంధ్ర లో టీడీపీ – జనసేన( TDP – Janasena ) కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది అని అనుకుంటున్నారు.కూటమి ప్రభంజనం దాటికి వైసీపీ నుండి అభ్యర్థులు పోటీ చెయ్యడానికే భయపడతారు అని అంటున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్ర, గుంటూరు వంటి జిల్లాల్లో ఒక్క సీట్ కూడా వైసీపీ కి వచ్చే అవకాశం లేదని అంటున్నారు.ఎన్ని స్థానాలు వచ్చిన నెల్లూరు,ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల నుండి రావాలి కానీ, పైన చెప్పిన ఆ నాలుగు జిల్లాలో వైసీపీ భూస్థాపితం అవ్వడం తథ్యం అని టాక్.

ఇక పవన్ కళ్యాణ్ ఈ నెల 21 వ తారీఖు నుండి కృష్ణ జిల్లాలో వారాహి విజయ యాత్ర ని ప్రారంభించబోతున్నట్టు సమాచారం.ఇప్పటికే మూడు ఫేస్లు పూర్తి చేసుకున్న ఈ టూర్ కి జనాల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుగుతున్న ప్రాంతాలు జనసేన పార్టీ( Janasena party ) కూటమి నుండి పోటీ చేసే ప్రాంతాలు అని అంటున్నారు విశ్లేషకులు.ఈ ప్రాంతాలన్నిట్లో జనసేన పార్టీ అధికార వైసీపీ పార్టీ పై బంపర్ మెజారిటీ తో గెలుస్తుందని అంటున్నారు.
పార్టీ కి అధిక శాతం విజయావకాశాలు పవన్ కళ్యాణ్ వల్లే ఉంటుంది కాబట్టి, ఆయనకీ పవర్ షేరింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.అందుకు జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో 90 శాతం స్థానాలు గెలవాల్సి ఉంటుంది.
మరి ఆ రేంజ్ లో జనసేన పార్టీ గెలుస్తుందో లేదో చూడాలి.







