సంవత్సరానికి లక్షల రూపాయల వేతనం వస్తున్నా ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడుతున్నారు.అయితే ఒక పోలీస్ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరు వేల మందిని చదివిస్తున్నారు.
పోలీస్ అనేవాడు మొదటిదానిని క్రిమినల్ చట్టాల కోణం నుంచి చూడాలని రెండోదాని విషయంలో అత్యంత సామాజిక బాధ్యతతో మెలగాలని ఐపీఎస్ అధికారి రవీంద్ర మిశ్రా( ravindra mishra ) చెబుతున్నారు.
రవీంద్ర మిశ్రా 2007 సంవత్సరంలో ఒక ఆదివాసి గూడేనికి వెళ్లగా అక్కడ మహిళ సివిల్ డ్రెస్ ( Women’s civil dress )లో ఉన్న రవీంద్రను చూసి బాబూ.
కూర్చుంటారా అని వాళ్ల భాషలో అడిగింది.అక్కడ ఆదివాసీ మహిళలు విటులను తమ దగ్గరకు రావాలని కోడ్ భాషలో అలా చెబుతారు.అయితే 14 ఏళ్ల బాలిక కూడా ఆ వృత్తిలో ఉండటాన్ని చూసి రవీంద్ర మిశ్రాకు బాధ కలిగింది.ఆ పాపను దత్తత తీసుకోవాలని రవీంద్ర భావించినా అక్కడి వాళ్లు ఒప్పుకోలేదు.
ఆ తర్వాత రవీంద్ర మిశ్రా ఆ తెగ ప్రజల దుస్థితిని మార్చాలని భావించారు.అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు చదువు విలువ చెప్పి కొంతమంది పిల్లల మనస్సును రవీంద్ర మార్చారు.
మొదట 13 మంది ఆడపిల్లలను రవీంద్ర మిశ్రా బడిలో చేర్పించారు.రవీంద్ర మిశ్రా సంవేదన అనే ఎన్జీవో( NGO ) సహాయంతో వాళ్ల ఆలనాపాలనా చూసుకున్నారు.
ఇతర జిల్లాల్లోని తెగ ప్రజల్లో కూడా రవీంద్ర మార్పు తెచ్చారు.
![Telugu Ravindra Mishra, Ravindramishra, Samvedana Ngo-Latest News - Telugu Telugu Ravindra Mishra, Ravindramishra, Samvedana Ngo-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/09/ravindra-mishra-success-story-details-here-goes-viral-in-social-mediaa.jpg)
ప్రస్తుతం రవీంద్ర శర్మ ఆరువేల మంది ఆడపిల్లలను చదివిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ప్రస్తుతం రవీంద్ర మిశ్రా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్( Industrial Security Force ) లో ఏఐజీగా చేరారు.రవీంద్ర చదివించిన ఎంతోమంది ఆడపిల్లలు పట్టభద్రులై ఉద్యోగాలు చేస్తున్నారు.
రవీంద్ర సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.ఆడపిల్లల చదువును ప్రోత్సహిస్తున్న రవీంద్ర మిశ్రాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.