ఉన్నత విద్య కోసం యూకే వెళ్తున్న భారతీయ విద్యార్ధుల( Indian students ) సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఇలాంటి వారికి ఆ దేశ ప్రభుత్వం షాకిచ్చింది.
స్టడీ వీసాపై భారీగా ఫీజును పెంచింది.బ్రిటీష్ పార్లమెంట్‌లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి.
యూకే వెలుపల స్టడీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల నుంచి 127 పౌండ్లు అదనంగా చెల్లించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పెరిగిన మొత్తంతో కలిపి స్టడీ వీసా రుసుము 490 పౌండ్లకు పెరిగింది.
ఈ మేరకు యూకే హోమ్ ఆఫీస్ శుక్రవారం ప్రకటించింది.అలాగే ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా రుసుములోనూ మార్పులు చేయబడ్డాయి.
ఇది 15 పౌండ్ల నుంచి 115 పౌండ్లకు పెరగనుంది.
పార్లమెంట్ ఆమోదానికి లోబడి.
ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ రుసుములు అక్టోబర్ 4 నుంచి పెరుగుతాయని హోం ఆఫీస్ ప్రకటించింది.హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ( Higher Education Statistics Agency ) డేటా ప్రకారం 2021-22లో 1,20,000కు పైగా భారతీయులు చదువుకుంటున్నారు.
వీరు దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్ధి సమూహంగా నిలిచారు.కీలకమైన సేవలకు చెల్లించడానికి ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ రుసుములలో మార్పులు చేశామని , ప్రభుత్వరంగ వేతనాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వడానికి , మరిన్ని నిధులను అనుమతించమని ప్రభుత్వం తెలిపింది.

ఇదిలావుండగా.యూకే వీసాల కోసం గ్రాడ్యుయేట్ స్థాయి అర్హతలు కలిగిన 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల భారతీయుల నుంచి బ్రిటీష్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.‘‘యూకే – ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్’’( UK – India Young Professional Scheme ) కింద సెకండ్ బ్యాలెట్‌ను ప్రారంభించింది.జూలై 27న మధ్యాహ్నం 1.30 గంటలతో సెకండ్ బ్యాలెట్ ముగిసింది.ఈ మేరకు ఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్ ట్వీట్ చేసింది.
ఈ స్కీమ్ కింద భారతీయ యువకులకు రెండేళ్ల వరకు యూకేలో నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

2023 సంవత్సరానికి గాను ఈ పథకం కింద మొత్తం 3,000 వీసాలు అందుబాటులో వున్నాయి.ఫిబ్రవరిలో విడుదలైన ఫస్ట్ బ్యాలెట్‌లో ఎక్కువ వీసాలు ఇచ్చినట్లు యూకే వీసాస్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూకేవీఐ) తెలిపింది.వీసా దరఖాస్తుకు 259 పౌండ్లు, ఆరోగ్య సంరక్షణ సర్‌ఛార్జ్ కింద 940 పౌండ్లు, వ్యక్తిగత పొదుపు కింద 2530 పౌండ్లు వున్నట్లు దరఖాస్తుదారుడు చూపించాలి.







