కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఓ రైతుకు వజ్రం లభించింది.
తుగ్గలి మండలం జొన్నగిరిలోని వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా రైతుకు వజ్రం దొరికిందని తెలుస్తోంది.దీన్ని రైతు వద్ద నుంచి స్థానిక వ్యాపారులు రూ.10 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.అయితే బయట మార్కెట్ లో ఆ వజ్రం విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.అయితే తొలకరి వర్షాలు పడిన తరువాత నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఈ వజ్రాల వేట కొనసాగుతుందన్న విషయం తెలిసిందే.
ఇక్కడి భూమిలో వజ్రాలు బయటపడతాయనే ప్రచారం నేపథ్యంలో స్థానిక గ్రామ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం వజ్రాల కోసం గాలిస్తుంటారు.







