ఆడపిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి.ఏపీలో తాజాగా గ్రూప్1 ఫలితాలు వెలువడగా శ్రీకాకుళానికి చెందిన ప్రదీప్తి( Pradeepti ) గ్రూప్1 రిజల్ట్స్ తో డీఎస్పీగా ఎంపికై ప్రశంసలను అందుకుంటున్నారు.
ప్రదీప్తి సోదరి ప్రతిభ ఆర్మీలో మేజర్ గా రాణిస్తున్నారు.శ్రీకాకుళానికి చెందిన ఈ ఇద్దరు యువతుల సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శ్రీకాకుళం( Srikakulam ) జిల్లా ఆముదాల వలస మండలంలోని కొర్లకోటకు చెందిన ప్రదీప్తి, ప్రతిభ తల్లీదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.ప్రదీప్తి పోలీస్ కావాలని లక్ష్యాన్ని ఎంచుకోగా ప్రతిభ ఆర్మీ ఆఫీసర్ కావాలని లక్ష్యాన్ని ఎంచుకోవడంతో సంతోషంగా పెళ్లిళ్లు చేసుకోకుండా ఎందుకొచ్చిన బాధలు అంటూ బంధుమిత్రుల నుంచి కామెంట్లు వినిపించడం గమనార్హం.

2020 సంవత్సరంలో గ్రూప్2 పరీక్షలో మంచి మార్కులు సాధించి ఎస్.ఐగా పని చేస్తున్న ప్రదీప్తికి గ్రూప్1 ఫలితాల్లో మంచి ర్యాంక్ రావడంతో డీఎస్పీగా ఉద్యోగం వచ్చింది.ప్రతిభ( Pratibha ) విషయానికి వస్తే 21 సంవత్సరాల వయస్సులో లెఫ్టినెంట్ గా భారత సైన్యంలో చేరడం గమనార్హం.ప్రతిభ మాట్లాడుతూ నాకు తెలిసిన అన్నయ్య ఒకరు ఆర్మీలో పని చేస్తున్నారని ఆయన ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని ఎస్.ఎస్.బీ పాస్ అయ్యానని చెప్పుకొచ్చారు.తర్వాత రోజుల్లో కెప్టెన్ గా, మేజర్ గా పదోన్నతి సాధించానని ఆమె కామెంట్లు చేశారు.

అమ్మాయిలను ఆసక్తి ఉన్న రంగాల వైపు ప్రోత్సహిస్తే వాళ్లు సక్సెస్ కావడం ఖాయమని ఆమె చెప్పుకొచ్చారు.మా పిల్లల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టారని మొదట ఆశించిన ఫలితాలు రాలేదని తల్లీదండ్రులు చెప్పుకొచ్చారు.అప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని ప్రతిభ, ప్రదీప్తి తల్లీదండ్రులు కామెంట్లు చేశారు.
ప్రతిభ, ప్రదీప్తి సక్సెస్ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







