ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర రాజకీయాలు చాలా సంచలనంగా మారిపోయాయి చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్టు కావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా తారుమారు అయ్యాయి.ఇలా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో( Ap Politics ) ఎప్పుడు ఇలాంటి పరిణామాలు జరగబోతున్నాయా అని దేశం మొత్తం ఏపీ రాష్ట్ర రాజకీయాల వైపే చూస్తోంది.
ఇలా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్టు కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం చంద్రబాబు నాయుడుని కలిసి తమ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయి అంటూ అధికారికంగా ప్రకటించారు.

ఇలా జనసేన టిడిపి పొత్తు కుదరడంతో మరోసారి ఈ రాష్ట్ర రాజకీయాలు చర్చలకు కారణమయ్యాయి.అయితే తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై నటి మంచు లక్ష్మి ( Manchu Lakshmi ) ట్విట్టర్ వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మంచు లక్ష్మి తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వావ్.
ఎ.పి.రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి అంటూ ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఈమె ఇలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఏదైనా అర్థం దాగి ఉందా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే మోహన్ బాబు మంచు విష్ణు జగన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక జగన్మోహన్ రెడ్డి చెల్లెలిని స్వయంగా విష్ణు వివాహం చేసుకోవడం గమనార్హం .ఇకపోతే తాజాగా మంచు మనోజ్ ( Manoj ) భూమా మౌనిక రెడ్డి ( Mounika Reddy ) ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని కూడా కలిసిన సంగతి మనకు తెలిసిందే.ఇలాంటి పరిణామాల నడుమ మంచు లక్ష్మి ఏపీ పాలిటిక్స్ పై స్పందించడంతో ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.







