దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y s rajasekhara Reddy )హాయంలో ఒక వెలుగు వెలిగి ఆయన ఆత్మగా పేరుపొందిన ప్రభుత్వ మాజీ సలహాదారు కాంగ్రెస్ కీలక నేత కెవిపి రామచందర్ రావు వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తో పాటు, అధికార పార్టీ బీఆర్ఎస్ లోను పెద్ద దుమారమే రేగుతోంది.కేవీపీ టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,( Revanth Reddy ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కెవిపి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) కి ఆత్మబంధువుగా ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా కేవీపీ వ్యవహరించారు.

వైఎస్ మరణం తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో ముఖ్య నేతగాను కెవిపికి మంచి గుర్తింపు ఉంది.అయితే క్తి గత కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో కేవీపీ ని టార్గెట్ చేసుకుంటూ రాజకీయం నడుస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,( Revanth Reddy ) కెవిపిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కూడా కేవీపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి తెరపైకి కనిపిస్తున్నా, కాంగ్రెస్ ను నడిపిస్తోంది కెవిపి రామచందర్రావే అంటూ మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ నేతలను నడిపించేది ఆంధ్ర నేత అంటూ తెలంగాణ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డికి కెవిపి రామచంద్ర రావుకు ఎటువంటి సంబంధాలు లేకపోయినా , ఆంధ్రకు చెందిన కేవీపీని చూపిస్తూ రేవంత్ ను కేటీఆర్ టార్గెట్ చేస్తున్నారు .

ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి కెవిపినే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కెవిపి రామచంద్రరావు( Kvp Ramachandra Rao ) కనుసన్న లోని నడుస్తోందని రేవంత్ విమర్శలు చేస్తున్నారు.కెవిపి సీఎం కేసీఆర్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో , కెవిపి చెప్పిన వారికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు, పోస్టింగులు ఇస్తున్నారని రేవంత్ విమర్శిస్తున్నారు.
అంతే కాకుండా తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లను ఏకం చేస్తూ కెవిపి కుట్రలు చేస్తున్నారనే అనుమానంతో ఉన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ చేస్తున్న విమర్శలను తనకు అవకాశం గా మార్చుకుని కేవీపీ పై నేరుగానే విమర్శలు మొదలుపెట్టారు.







