స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు తరపు వాదనలు వినిపిస్తున్న సిద్దార్థ్ లూథ్రా మరో ట్వీట్ చేశారు.
ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలు, అపహాస్యాన్ని పట్టించుకోకుండా ఒక మనిషి తన విధులు తాను నిర్వర్తించాలని స్వామి వివేకానంద చెప్పారని లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.
సిక్కు పదో గురువు మాటలను చదవని అర్థం చేసుకుని వారి మాటలను ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని లూథ్రా ట్వీట్ లో పేర్కొన్నారు.నిన్న గురు గోవింద్ సింగ్ జఫర్ నామాలోని ఓ సూక్తిని లూథ్రా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో ఎంత పోరాటం చేసినా సరైన న్యాయం జరగనప్పుడు కత్తి పట్టడమే సరైనదని లూథ్రా తెలిపారు.ఈ నేపథ్యంలో సిద్దార్థ్ లూథ్రా ట్వీట్లపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.







