సూర్యాపేట జిల్లా: మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలేనని నిరూపించే అమానవీయ సంఘటన సూర్యాపేట జిల్లా( Suryapet District )లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే… మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన వెంపటి సత్యనారాయణ(62)గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
మృతుని భార్య భాగ్యమ్మ(58) కుటుంబ కలహాలతో భర్తను వదిలి గత ఆరేళ్లుగా బంధువుల వద్దే ఉంటుంది.
భర్త మరణించిన విషయం తెలిసి వచ్చిన భార్య భాగ్యమ్మను చూసిన మృతిని తమ్ముళ్లు, బంధువులు,భాగ్యమ్మ బంధువులు ఇప్పుడే అస్తి పంపకాలు జరగాలని, పంపకాలు అయ్యాకే అంత్యక్రియలు జరగాలని ఇరు వర్గాలు వాగ్వాదానికిదిగారు.
సర్ది చెప్పాలని ప్రయత్నం చేసిన గ్రామ పెద్ద మనుషులతో కూడా ఘర్షణకు దిగి,శవాన్ని సిరికొండలో ఇంట్లో వదిలేసి మోతె మండల( Mothey Mandal ) కేంద్రంలోనిమీ సేవ కేంద్రం వద్దకొచ్చి గొడవ పడుతూ రోడ్డుపై ఆందోళనకు దిగితే, మరోపక్క మృతుని బంధువులైన చిన్న అత్త కూతుర్లు మాకు అస్తిలో సగ బాగం వస్తుందని, భాగం పంపిణీ చేయాలని రాస్తారోకోకు దిగారు.ధరణి( Dharani )లో స్లాట్ బుక్ చేసిన తరువాతే ఇరు వర్గాలు ఇంటి దారి పట్టారు.
ఇదంతా చూసిన గ్రామస్తులు,మండల ప్రజలు ఔరా ఇదేమి విడ్డూరం అంటూ ముక్కున వేలేసుకున్నారు.