జమ్మూ కాశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారుల మృతి..!!

జమ్మూ కాశ్మీర్( Jammu Kashmir ) అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు.భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో భారత ఆర్మీ కల్నల్ మన్ ప్రీత్, మేజర్ ఆశీష్, డీఎస్పీ హుమయూన్ వీర మరణం పొందారు.

 Clashes In Jammu And Kashmir Three Senior Army Officers Killed , Jammu And Kashm-TeluguStop.com

దీంతో భద్రత బలగాలు అప్రమత్తమయ్యి ఎదురు కాల్పులు జరుగుతున్న ప్రాంతానికి భారీగా బలగాలను పంపించడం జరిగింది.ఈరోజు ఉదయం కోకెర్ నాగ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారులు గాయపడ్డారు.

గత కొద్ది రోజుల నుండి జమ్మూ కాశ్మీర్ లో స్థానిక పోలీసులు , ఆర్మీ ఉగ్రవాదుల ( Army terrorists )కోసం భారీగా కూంబింగ్ నిర్వహిస్తూ ఉంది.దీనిలో భాగంగా మంగళవారం రాజౌరీలోని నార్తా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.ఇదే సమయంలో ఉగ్రవాదులు వున్నట్లుగా అనుమానం కలిగిన ప్రాంతాలలో భద్రతా దళాలు నిర్వహిస్తున్న సెర్చ్ ఆపరేషన్ లో పెద్ద మొత్తంలో వార్ డంప్‌లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.వీటిపై పాక్ గుర్తులు వున్నట్లుగా సమాచారం.

సెప్టెంబర్ 7 నుంచి ఉగ్రవాదుల కదలికలపై భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు నిఘా పెట్టీ.కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

దీంతో ఉగ్రవాదులకు భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులలో నేడు ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు మృతి చెందడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube