మోడీ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలు అప్పుడప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి.ప్రస్తుతం అలాగే జమిలి ఎలక్షన్స్ పై జరుగుతున్నా పరిణామాలు కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ నినాదంతో దేశమంతా ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించాలని, ఇలా చేయడం వల్ల ఎలక్షన్స్ కు అయ్యే ఖర్చు ఆదా అవుతుందని, కేంద్రం చెబుతోంది.అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడే ఎందుకు ఈ జమిలి ఎలక్షన్స్ ( Jamili Elections )అనే ప్రశ్నకు మాత్రం మోడీ సర్కార్ వద్ద ఎలాంటి సమాధానం లేదు.

అయితే మోడీ ( Narendra Modi )సర్కార్ జమిలి ఎలక్షన్స్ వైపు ఎందుకు అడుగులు వేస్తోందో అనే దానిపై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తాజాగా ప్రముఖ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్.( Prashant Bhushan ).జమిలి ఎలక్షన్స్ వెనుక ఉన్న మోడీ మాస్టర్ ప్లాన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.ఈ ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన వాయిదా వేసేందుకే మోడీ సర్కార్ జమిలి ఎలక్షన్స్ వైపు అడుగులు వేస్తోందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇంతకీ మోడీ సర్కార్ కు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాల్సిన అసవరం ఏముంది అంటే.
ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మద్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం వంటి రాష్ట్రాలలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉంది.

తెలంగాణ మిజోరాం వంటి రాష్ట్రాలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో బీజేపీ ( BJP )ఉంది.దానికి తోడు వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి.అందువల్ల ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన మోడీ సర్కార్ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలవైపు అడుగులు వేస్తోందనేది కొందరి అభిప్రాయం.
అయితే జమిలి ఎన్నికలు అమలు చేయడం అంతా తేలికైన విషయం కాదు.ఎందుకంటే బీజేపీ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన ప్రతిపక్షాలు జమిలి ఎన్నికలకు మద్దతు తెలిపే అవకాశాలు చాలా తక్కువ.
మరి మోడీ సర్కార్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.







