రష్మిక బాటలోనే కీర్తి సురేష్... సక్సెస్ కోసం తప్పని తిప్పలు?

కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోవడం ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే అంశమే.ఇలా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తున్నటువంటి తరుణంలో పాత హీరోయిన్ లకు వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు పడితే వారి సినీ కెరియర్ అంతటితో పుల్ స్టాప్ పడినట్లేనని చెప్పాలి.

 Interesting News Viral About Keerthy Suresh Cini Career , Keerthy Suresh, Rashmi-TeluguStop.com

ఇలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోయిన్ లో సినిమా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు అలాగే మరికొందరు వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నారు.ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ ( Keerthy Suresh )కూడా ఒకరు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Rashmika, Tollywood, Venuswam

ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలలో సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ అయినవే ఎక్కువగా ఉన్నాయి.తాజాగా ఈయన మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi )చెల్లెలుగా భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో కీర్తి సురేష్ పట్ల ఎన్నో రకాల ట్రోల్స్ సోషల్ మీడియాలో వచ్చాయి ఇకపోతే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో తన కెరియర్ ఎలాంటి ఇబ్బందులలో పడకుండా మంచి సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో తన తల్లి సూచనల మేరకు ఈమె కూడా వేణు స్వామి ( Venu Swamy )చేత ప్రత్యేకంగా పూజలు చేయించాలని భావించారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Keerthy Suresh, Rashmika, Tollywood, Venuswam

సాధారణంగా ఇలాంటి వాటిపై ఈమెకు పెద్దగా నమ్మకం ఉండదు కానీ ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నటువంటి రష్మిక ( Rashmika ) ఇతర హీరోయిన్స్ అందరూ కూడా వేణు స్వామి చేత పూజలు చేయించి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ క్రమంలోనే తన తల్లి సూచనల మేరకు కీర్తి సురేష్ కూడా వేణు స్వామి జాతక పరిహార దోషాలు చేయించి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో కీర్తి సురేష్ కూడా రష్మిక బాటలోనే పయనిస్తుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube