ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు టాప్ డైరెక్టర్( Top Director ) అనే దానిమీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) అని కాకుండా సినిమా మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేదానిమీద చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఇప్పటికే రాజమౌళి( Rajamouli ) బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో సూపర్ హిట్ సాధించిన విషయం మనకు తెలిసిందే ఇక నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనే పోటీకి వస్తున్న మరో డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prasanth Neel ) ఈయన కే జి ఎఫ్ సీరీస్ తో మంచి సక్సెస్ సాధించాడు.
ఇక వీళ్ళతో పాటుగా సుకుమార్( Sukumar ) కూడా పుష్ప సినిమాతో దాదాపు 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ ని రాబట్టాడు అందుకని సుకుమార్ కూడా నెంబర్ వన్ డైరెక్టర్ల లిస్టులో ఉన్నాడు.
అయితే ఈ ముగ్గురిని బేస్ చేసుకొని మనం నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం కష్టమే అవుతుంది.ఒక వంతుకు ఇప్పుడున్న డైరెక్టర్లలో రాజమౌళినే నెంబర్ వన్ డైరెక్టర్ అయినప్పటికి ఆయన నెక్స్ట్ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో

దాన్ని బేస్ చేసుకుని మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ లో ఎవరు ఉంటారు అనేది చెప్పడం జరుగుతుంది ఇక సుకుమార్ పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తాడో కూడా తెలియాల్సి ఉంది.అలాగే ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ తో చేస్తున్న సలార్ సినిమా( Salaar ) కూడా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలి ఇక ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయో కూడా తెలియాలి.

అలాగే రాజమౌళి మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమా కలక్షన్స్ ని బట్టి అప్పుడు కూడా రాజమౌళినే నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటే ఆ నెంబర్ వన్ చైర్ అనేది రాజమౌళికే దక్కుతుంది.కానీ ఈలోపు శంకర్ గాని, లేదా బాలీవుడ్ డైరెక్టర్లు గాని రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డులని బ్రేక్ చేయగలిగితే మళ్లీ వాళ్లే టాప్ పొజిషన్ లోకి వస్తారు.చూడాలి మరి నెక్స్ట్ వచ్చే సినిమాల మీదనే నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేది ఆధారపడి ఉంది…
.







