మామూలుగా సినిమా ఇండస్ట్రీలో( Film Industry ) హీరో హీరోయిన్ లు సినిమాల ద్వారా కమర్షియల్ యాడ్స్ ద్వారా అలాగే బిజినెస్ ల ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తూ ఉంటారు.ప్రస్తుత రోజుల్లో అయితే హీరోలు ఒక్కో సినిమాకు 30,40 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా పారితోషికాన్ని అందుకుంటున్నారు.
హీరోయిన్లు కూడా కోట్లలో పారితోషికాన్ని అందుకుంటున్నారు.ఇప్పుడు కాకుండా గతంలో కూడా చాలామంది హీరోయిన్లు బాగా సంపాదించారు.
అటువంటి వారిలో జయలలిత( Jayalalithaa ) కూడా ఒకరు.ఈమె 1960లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే.
తెలుగు తమిళ భాషల్లో నటించి మెప్పించింది.

అంతేకాకుండా కోట్లల్లో డబ్బులు సంపాదించింది.మొదట జయలలిత 1961లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.నాటకరంగం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా 1960 మధ్య కాలంలో తమిళ, తెలుగు చిత్రాలలో ప్రముఖ నటిగా మారింది.1968లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.ధర్మేంద్రతో కలిసి ఇజ్జత్ సినిమాలో కనిపించింది.అగ్ర నటిగా ఉంటూనే 1980లో సినిమా నుంచి తప్పుకున్న జయలలిత రాజకీయాల వైపు మళ్లింది.1997లో జయలలిత రాజకీయ ఖ్యాతి గడించింది.మరోవైపు చెన్నైలోని ఆయన పోజ్ గార్డెన్ నివాసం( Poes Garden )పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది.ఆదాయ పన్ను శాఖ అధికారులు జయలలిత ఇంట్లో సోదాలు జరిపిన ఆ రోజుల్లో నటి ఇంట్లో 10,500 చీరలు, 750 జతల బూట్లు, 91 వాచీలు, 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం సహా స్థిరాస్తులు దొరికాయి.

అయితే 2016లో మరోసారి ఆస్తులపై దాడులు( Jayalalithaa IT Raids ) జరిగాయి.అప్పట్లో నటి జయలలిత వద్ద 1250 కిలోల వెండి, 21 కిలోల బంగారం ఉంది.రూ.42 కోట్ల విలువ చేసే చరాస్తులు, 8 వాహనాలను కలిగి ఉన్నారు.అయితే ఆ సమయంలోనే జయలలిత నికర విలువ దాదాపుగా రూ.900 కోట్లు, ఆమె ప్రకటించిన రూ.188 కోట్ల కంటే చాలా ఎక్కువే.అందుకే అధికారులు ఆమె ఆస్తుల్ని జప్పు చేశారు.
ఆమెపై కేసులు కూడా పెట్టారు.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత 2016 డిసెంబర్‌లో 68 ఏళ్ల వయసులో అప్పటి ముఖ్యమంత్రిగా( CM Jayalalithaa ) ఉండగానే మరణించారు.
తమిళ ప్రజలు జయలలితను తలైవి,పురిచ్చి తలైవి అని పిలుచుకునేవారు.ఇలా అత్యధికంగా డబ్బులు సంపాదించి ఇండియాలోనే రిచెస్ట్ నటి( Richest Actress in India )గా కూడా గుర్తింపు తెచ్చుకుంది జయలలిత.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఆస్తిపాస్తులు తెలిసి నూరేళ్ల బెడుతున్నారు.







