కూతురుకి – నాన్నకు మధ్య ప్రేమ( Father Daughter Love ) ఎలా వుంటుందో ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.వారి అనుబంధం ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా కనబడుతుంది.
ఈ క్రమంలో చాలామంది తమ కూతుళ్లపైన ప్రేమను రకరకలుగా చూపిస్తూ వుంటారు.సోషల్ మీడియా ఇపుడు బాగా అందుబాటులో వుండడం చేత ఇటువంటి ఆసక్తికరమైన ఘటనల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము.
తాజాగా యూకేకి చెందిన ఓ వ్యక్తి తన కూతురుపట్ల తనకున్న ప్రేమను చాలా వినూత్నంగా ప్రకటించుకున్నాడు.దాంతో కట్ చేస్తే అతగాడు ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.

ఈ క్రమంలో అతగాడు తన కూతురు పేరును ఏకంగా 667 సార్లు టాటూలుగా వేయించుకోవడం ఆశ్చర్యకరం.అవును, జీవితంలో ఎంతగానో ప్రేమించే వ్యక్తుల పేర్లను జనాలు పచ్చబొట్టుగా వేసుకుంటారు.అయితే యూకేకి చెందిన 49 సంవత్సరాల మార్క్ ఓవెన్ ఎవాన్స్( Mark Owen Evans ) శరీరంపై ఒకే పేరును ఎక్కువసార్లు వేయించుకున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అది కూడా తన కూతురి పేరుని 667 సార్లు టాటూగా వేయించుకుని ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.2017 లో ఓవెన్ ఎవాన్స్ తన కూతురు లూసీ పేరు( Luci Name )ను తన వీపుపై 267 సార్లు టాటూ వేయించుకున్నాడు.

అలా అప్పట్లోనే మనోడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్( Guinness World Record ) పొందాడు.అయితే 2020లో USA కి చెందిన 27 సంవత్సరాల డైడ్రా విజిల్ అతని రికార్డును అధిగమిస్తూ 300 టాటూలు వేయించుకోగా ఎవాన్స్ తన పాత రికార్డును ఎలాగన్నా తిరిగి పొందాలని లూసీ అని మరో 400 టాటూలు వేయించుకున్నాడు.దాంతో మొత్తం కలిపి 667 టాటూలుగా( 667 Tattoos ) మారింది.
ఈసారి అతను తొడలపై టాటూలు వేయించుకోవడం కొసమెరుపు.ఒక్కో తొడపై 200 చొప్పున 400 టాటూలు వేసినందుకు ఇద్దరు టాటూ ఆర్టిస్టులకు ఐదున్నర గంటల సమయం పట్టిందని సమాచారం.
మొత్తానికి ఎవాన్స్ కూతురి పేరుతో అత్యధిక టాటూలు వేయించుకుని ప్రేమను చాటుకుంటూనే మరోవైపు ప్రపంచ రికార్డు సైతం సొంతం చేసుకున్నాడన్నమాట.







