యంగ్ బ్యూటీ నేహా శెట్టి( Young Beauty Neha Shetty ) గురించి తెలియని వారు లేరు.అంతగా ఈ భామ తెలుగులో ఫేమస్ అయ్యింది.
ముందుగా మెహబూబా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.తొలి సినిమా తోనే అమ్మడు ఆకట్టుకునే అందం అభినయంతో అలరించింది.
ఆ తర్వాత గల్లీ రౌడీ సినిమా కూడా చేసింది.కానీ మరీ నెక్స్ట్ లెవల్లో క్రేజ్ అయితే దక్కించు కోలేదు.

కానీ ఈమె నటించిన డీజే టిల్లు( DJ Tillu ) మాత్రం ఈమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి.ఒకే ఒక్క సినిమాతో అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగింది.గత ఏడాదిలో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ”డీజే టిల్లు” కూడా ఉంది.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాతో రాధికా పాత్రలో నటించిన ఈ అమ్మడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.ఇక ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు పెద్దగా అవకాశాలు లేకపోయినా ఈ మధ్య బాగా రాణిస్తూ వరుస సినిమాలతో దూసుకు పోతుంది.
మరి ఇటీవలే బెదురులంక 2012 సినిమా( Bedurulanka 2012 )తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

దీంతో ఈమెకు వరుస ఆఫర్స్ వరిస్తున్నాయి.పైగా ఈమె అందాల ఆరబోత కూడా మాములుగా ఉండదు.ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటించింది.
ఈ సినిమాతో ఈమె హాట్ టాపిక్ అయ్యింది.అలాగే రూల్స్ రంజన్( Rules Ranjan ) తో కూడా అతి త్వరలోనే పలకరించనుంది.
ఇవే కాదు ఇంకా అధికారిక ప్రకటన రాని రెండు మూడు యంగ్ హీరోల సినిమాల్లో కూడా ఈమె ఫైనల్ అయినట్టు టాక్.మొత్తానికి రాధికాకు లక్ బాగానే కలిసి వస్తుంది.







