దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్ జె సూర్య ( SJ Suriya ) ఒకరు.ఒకప్పుడు దర్శకుడిగా పని చేస్తూ ఎంతో మంది స్టార్ హీరోలకు ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను అందించినటువంటి ఈయన ప్రస్తుతం దర్శకత్వానికి కాస్త దూరంగా ఉంటూ నటుడిగా మారిపోయి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజాగా విశాల్( Vishal ) మార్క్ ఆంటోనీ ( Mark Antony ) సినిమాలో ప్రధాన పాత్రని పోషించాడు.ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.తాను దర్శకుడిగా ఉన్న సమయంలో తమిళ హీరోలు అయినటువంటి అజిత్, విజయ్ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ వంటి వారందరికీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాను కానీ మహేష్ బాబు( Mahesh Babu ) విషయంలో నేను అనుకున్నది సాధించలేకపోయానని తెలిపారు.మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నాని సినిమా( Nani Movie) కు ఎస్ జె సూర్య దర్శకుడిగా పనిచేశారు.సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా గురించి తాజాగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ తాను అందరికీ హిట్ సినిమాలను అందించాను కానీ మహేష్ బాబుకు మాత్రం హిట్ అందించలేకపోయానని తెలిపారు.ఈ విషయం తరచూ తనని వెంటాడుతూనే ఉందని అయితే ఈ సినిమా విషయంలో తాను మహేష్ బాబుకి బాకీ ఉన్నానని త్వరలోనే ఒక సూపర్ హిట్ సినిమా ఆయనకు అందించి నా బాకీ తీర్చుకుంటాను.ఇది నా మట అంటూ ఎస్ జె సూర్య ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది
.






