టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టు తర్వాత మీడియాతో నారా లోకేష్ ( Nara Lokesh )నేడు మాట్లాడటం జరిగింది.తన తండ్రి ప్రతిక్షణం అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి అని లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప మరేమీ ఆలోచించరని స్పష్టం చేశారు.దేశ రాజకీయాల్లో అరుదైన గుర్తింపు కలిగిన నేత చంద్రబాబు.
చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈఓ లు కూడా చెబుతారు.ప్రజాసేవ తప్ప అవినీతి అనేది మా రక్తంలోనే లేదు.
ఎన్నిసార్లు జైలుకు పంపిన తమ పోరాటం ఆగదని రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ ప్రభుత్వనీ లోకేష్ హెచ్చరించారు.సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని అభివర్ణించారు.
సైకో జగన్ కుట్రలు చేసి చంద్రబాబుపై అవినీతి మరకలు వేస్తున్నారని మండిపడ్డారు.తనపై ఉన్న అవినీతి బురదను జగన్( jagan ) ఈ రాష్ట్రంలో నేతలందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై అవినీతి ముద్ర పడలేదు.కానీ జగన్ సైకో ఇజం ప్రజలందరికీ అర్థమయింది అని అన్నారు.తెలుగుదేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని బయటపడింది.కచ్చితంగా చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయట పడతారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కష్ట కాలంలో తమకు అండగా ఉన్న పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల నేతలకు లోకేష్ ధన్యవాదాలు తెలియజేశారు.