న్యూయార్క్( New York ) నగరంలోని నాలుగు యూనిఫాం ఏజెన్సీలు .పోలీస్, అగ్నిమాపక, పారిశుద్ధ్యం, కరెక్షన్స్ విభాగాలను వారి ఓవర్‌టైమ్ ఖర్చులను తగ్గించాల్సిందిగా మేయర్ ఎరిక్ ఆడమ్స్ బడ్జెట్ డైరెక్టర్ జాక్వెస్ జిహా( Jacques Jiha ) ఆదేశించారు.
ఈ మేరకు శనివారం ఎన్‌వైపీడీ, ఎఫ్‌డీఎన్‌వై, డీవోసీ, డీఎస్‌ఎన్‌వైలకు మెమో పంపించారు.ఏజెన్సీలు గతేడాదితో పోలిస్తే తమ ఓటీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను తప్పనిసరిగా సమర్పించాలని , వారి పురోగతిని నెలవారీగా సిటీ హాల్‌కు నివేదించాలని జిహా పేర్కొన్నారు.
వందలాది మంది శరణార్ధులు రావడంతో నగరం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆడమ్స్ హెచ్చరించడంతో ఏజెన్సీలకు ఈ మెమో వచ్చింది.వచ్చే మూడేళ్లలో న్యూయార్క్‌కు 12 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని మేయర్ అంటున్నారు.
నగరం తక్షణం తన ఖర్చును తక్షణం 5 శాతం, వసంతకాలం నాటికి 15 శాతం తగ్గించుకోవాల్సి వుంటుందని జిహా చెప్పారు.అంచనా వేసిన శరణార్దుల ఆశ్రయం ఖర్చులలో మూడింట రెండొంతులు మాత్రమే కవర్ చేస్తుందన్నారు.

అతిపెద్ద పోలీస్ యూనియన్ అయిన పోలీస్ బెనివలెంట్ అసోసియేషన్ నాయకుడు పాట్రిక్ హెండ్రీ( Patrick Hendry ).పోలీసుల ఓవర్‌టైమ్‌ను తగ్గించాలనే ఆలోచనను తప్పుబట్టారు.ఎన్‌వైపీడీలో ఇప్పటికే సిబ్బంది తక్కువగా వున్నారని.నేరాలను 2020కి ముందు నాటి స్థాయికి తగ్గించాలని పోలీసులు పోరాడుతున్నారని చెప్పారు.ప్రజల భద్రతకు హాని కలిగించకుండా డబ్బు ఆదా చేయాలనుకుంటే .అనుభవం వున్న పోలీసులను ఉద్యోగంలో వుంచేలా పెట్టుబడి పెట్టాలని హెండ్రీ హితవు పలికారు.

2025లో మరోసారి న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఎరిక్ ఆడమ్స్( Eric Adams ).పోలీస్ సిబ్బందిని తగ్గించడం ద్వారా పెద్ద గ్యాంబుల్ చేస్తున్నాడని ఓ రాజకీయ వ్యూహకర్త అభిప్రాయపడ్డాడు.గతంలో పోలీస్ యూనియన్‌లతో కలిసి పనిచేసిన కన్సల్టెంట్ హాంక్ షీన్‌కోఫ్ మాట్లాడుతూ.మీరు ఓవర్‌టైం కట్ చేస్తే, వీధిలో తక్కువ మంది పోలీసులు వుంటారని పేర్కొన్నారు.ఇది తక్కువ పోలీస్ రక్షణకు సమానమని ఆయన తెలిపారు.ఎన్‌వైపీడీ ఓటీ బడ్జెట్ గతేడాది 700 మిలియన్ డాలర్లకు పైగా వుంది.
అయితే అధిక పోలీస్ ఓవర్‌టైమ్ ఖర్చులపై విమర్శకులు చాలాకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.అయితే మాజీ ట్రాన్సిట్ కాప్ అయిన ఆడమ్స్ కూడా ప్రజా భద్రతను పునరుద్ధరిస్తామన్న వాగ్ధానంపై మేయర్ పదవికి పోటీ చేశారు.
నగరంలో ఓవర్‌టైం తగ్గింపు అనేది శరణార్ధుల సంరక్షణ ఖర్చులను ఎదుర్కోవటానికి ఆడమ్స్, అతని బడ్జెట్ డైరెక్టర్ వేసిన వ్యూహంలో భాగం.
.







