ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..?

పెరుగు ఎండుద్రాక్షలు తినడం అనేది అద్భుతమైన ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.రక్తపోటు ఉన్నవారు రోజు వీటిని తినడం ఎంతో మంచిది.

 Taking Raisins With Curd Health Benefits Details, Raisins With Curd ,health Bene-TeluguStop.com

ఎండు ద్రాక్ష( Raisins ) పెరుగు( Curd ) తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే పేగులకు మేలు జరుగుతుంది.

ఎందుకంటే పెరుగు, ఎండు ద్రాక్షను కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.అంతేకాకుండా దీని వినియోగం పేగు మంట ను కూడా తగ్గిస్తుంది.

మీరు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటే సులభంగా వ్యాధులకు గురవుతారు.అటువంటి పరిస్థితిలో మీరు పెరుగులో ఎండు ద్రాక్షను కలిపి తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిని( Immunity Power ) పెంచుతుంది.

Telugu Anemia, Curd, Dry Grapes, Benefits, Tips, Immunity, Iron Deficiency, Prob

అంతేకాకుండా శరీరంలో ఐరన్ లోపం( Iron Deficiency ) కారణంగా రక్తహీనత కూడా ఉంటుంది.పెరుగులో ఎండుద్రాక్షను కలిపి తీసుకుంటే అది శరీరంలోని ఐరన్ లోపాన్ని కూడా దూరం చేస్తుంది.దీని వల్ల రక్తహీనత( Anemia ) వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడేవారు ఎండు ద్రాక్షను పెరుగులో కలిపి తింటే నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

రోజు ఎండు ద్రాక్ష పెరుగు తినడం వల్ల పురుషులకు ప్రయోజనకరంగా ఎంతో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే పెరుగు అనేక ఇతర వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది.

Telugu Anemia, Curd, Dry Grapes, Benefits, Tips, Immunity, Iron Deficiency, Prob

అందుకే పెరుగు తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇది పురుషుల లైంగిక సమస్యలను తొలగించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే పెరుగు మంచి ప్రోబయోటిక్( Probiotic ) ఆహారం.అలాగే ఎండు ద్రాక్షలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.మొదట ఒక గిన్నెలో నాలుగు నుంచి ఐదు ఎండుద్రాక్ష, కొద్దిగా పెరుగు కలపాలి.పెరుగును కనీసం 8 గంటల పాటు అలాగే ఉంచాలి.

పెరుగును ఎండు ద్రాక్షతో కలిపి మధ్యాహ్నం భోజనంలో లేదంటే సాయంత్రం 4 గంటల తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube