సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) నోయిడాలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా( Renu Sinha ) తన భర్త నితిన్ నాథ్ సిన్హా తో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివాసం ఉంటున్నారు.
గత రెండు రోజులుగా రేణు సిన్హా కనిపించకుండా పోయారు.ఆమె సోదరుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రేణు సిన్హా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
దీంతో రేణు సిన్హా సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ ఫిర్యాదులో తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని పేర్కొన్నాడు.రేణు సిన్హా మిస్సింగ్ కేసు( Missing Case ) నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.న్యాయవాది దంపతులు నివాసం ఉంటున్న బంగ్లాలో క్షుణ్ణంగా వెతకగా బాత్ రూమ్ లో రేణు సిన్హా మృతదేహం లభ్యం అయింది.
అయితే మృతురాలి భర్త నితిన్( Nithin Sinha ) కూడా కనిపించలేదు.
దీంతో అతడి కోసం కూడా గాలించగా ఎక్కడ అతని ఆచూకీ లభించలేదు.నితిన్ కు ఫోన్ చేసిన కలవకపోవడంతో చివరికి ఫోన్ నెంబర్ ట్రాక్ చేయగా అది బంగ్లా లోనే ఉన్నట్లు చూపించింది.మరోసారి బంగ్లా మొత్తం గాలించగా స్టోర్ రూమ్ లో నితిన్ కనిపించాడు.
పోలీసులు నితిన్ అదుపులోకి తీసుకున్నారు.నితిన్ తన భార్య రేణు సిన్హా ను హత్య చేసిన తర్వాత స్టోర్ రూమ్ లోనే 36 గంటల పాటు దాకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హత్యకు గల కారణాలు ఏమిటో విచారణలో బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.