రాజమౌళి, సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లెవెల్ లో ఉన్నారు.ఈ ఇద్దరు డైరెక్టర్ల సినిమాలు రికార్డ్ స్థాయిలో తమ సినిమాల ద్వారా కలెక్షన్లను సాధిస్తూ ఇతర ఇండస్ట్రీలలో కూడా ప్రశంసకు అందుకుంటున్నారు.
అయితే సుకుమార్ తను సక్సెస్ సాధించడంతో పాటు తన శిష్యులు కూడా సినిమాల ద్వారా సక్సెస్ సాధించేలా చేస్తుండగా రాజమౌళి మాత్రం ఈ విషయంలో ఫెయిలవుతున్నారు.సుకుమార్ తన శిష్యులు తెరకెక్కించే సినిమాల కథలు అద్భుతంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఈ విధంగా చేయడం వల్ల శిష్యులు కూడా భారీ విజయాలను అందుకుంటున్నారు.సుకుమార్ తన సినిమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా శిష్యుల సినిమాలకు హెల్ప్ చేస్తున్నారు.
పలు సినిమాలకు సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు( Buchi Babu Sana ) ఉప్పెన సినిమాతో సక్సెస్ అందుకున్నారు.సుకుమార్ కథ విషయంలో సహాయం చేయడంతో కార్తీక్ దండు విరూపాక్ష సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.పల్నాటి సూర్యప్రతాప్ కుమారి 21ఎఫ్, 18 పేజెస్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు.
ఈ దర్శకుడు కూడా సుకుమార్ శిష్యుడు కావడం గమనార్హం.సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో భారీ హిట్ ను అందుకున్నారు.

రాజమౌళి శిష్యుల( Rajamouli ) విషయానికి వస్తే కరుణ్ కుమార్ తీసిన ద్రోణ మూవీ ఫ్లాపైంది.త్రికోటి తీసిన జువ్వ, దిక్కులు చూడకు రామయ్య( Dikkulu Choodaku Ramayya ) సినిమాలు సక్సెస్ కాలేదు.ఆశ్విన్ గంగరాజు తీసిన ఆకాశవాణి, జీ.ఆర్ కృష్ణ తీసిన ఇద్దరి లోకం ఒకటే, మహాదేవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిత్రుడు, నవీన్ గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన గాలిపటం సినిమాలు ఫ్లాపయ్యాయి.ఈ విధంగా రాజమౌళి కంటే సుకుమార్ పైచేయి సాధిస్తున్నారు.ఈ కామెంట్ల విషయంలో సుకుమార్, రాజమౌళి ఏ విధంగా ఫీలవుతారో చూడాల్సి ఉంది.







