రాయచోటిలో ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య..!

సమాజంలో అక్రమ సంబంధాల( Illegal Relationships ) కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యి రోడ్డున పడుతున్నాయి.ఈ మధ్య వెలుగులోకి వస్తున్న అక్రమ సంబంధాలు దారుణమైన హత్యలకు కారణం అవుతున్నాయి.

 Wife Killed Husband For Illegal Affair In Rayachoti Details, Wife, Illegal Affai-TeluguStop.com

భార్యాభర్తలలో ఒకరు హత్యకు గురైతే మరొకరు జైలు పాలు అవుతున్నారు అనడానికి ఈ హత్య ఘటనే నిదర్శనం.ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన ఘటన రాయచోటిలో( Rayachoty ) చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

రాయచోటి పట్టణంలోని ప్రకాష్ నగర్ పాపిరెడ్డి కోళ్ల ఫారం సమీపంలో ఆంజనేయుల నాయుడు(35), నందిని అనే దంపతులు నివాసం ఉంటున్నారు.ఆంజనేయుల నాయుడు( Anjaneyula Naidu ) వీరబల్లి మండల కేంద్రంలో వీఆర్వో గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే అదే ప్రాంతానికి చెందిన చిన్నప్ప రెడ్డి అనే వ్యక్తితో నందినికి( Nandini ) ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.సమయం దొరికినప్పుడల్లా వీరిద్దరూ ఏకాంతంగా గడిపేవారు.

Telugu Anjaneyula, Chinnapa, Relationship, Nandini, Rayachoti-Latest News - Telu

అయితే ఆదివారం తెల్లవారుజామున ఆంజనేయుల నాయుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి భార్య నందిని విచారించగా తన భర్త ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లో కింద పడి చనిపోయాడని తెలిపింది.కానీ నందిని ప్రవర్తన పై పోలీసులకు అనుమానం రావడంతో కాస్త లోతుగా విచారణ చేపట్టారు.

Telugu Anjaneyula, Chinnapa, Relationship, Nandini, Rayachoti-Latest News - Telu

ఆంజనేయుల నాయుడు రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని ముఖంపై దిండు వేసి గట్టిగా అదిమి ఊపిరి ఆడనీయకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.నందిని తన ప్రియుడు చిన్నపరెడ్డి తో( Chinnapareddy ) కలిసి భర్తను చంపేసినట్లు పోలీసులు నిర్ధారించారు.అయితే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

త్వరలోనే వారిని పట్టుకుని పూర్తిస్థాయిలో లోతుగా విచారణ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube