టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.అక్రమంగా తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేశారంటూ నిరసనకు దిగుతున్నారు.
శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తుగా ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను గృహా నిర్బంధం చేశారు.మరి కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గానూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.







