తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని( Chandrababu Naidu ) ఈరోజు ఉదయం ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.స్కిల్ డెవలప్మెంట్( Skill Development Scam ) కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ1గా చంద్రబాబుని.సీఐడీ పేర్కొని ప్రస్తుతం విజయవాడ సిట్ కార్యాలయంలో విచారిస్తూ ఉంది.
అయితే చంద్రబాబు అరెస్టు పట్ల వైసీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( MP Vijayasai Reddy ) ట్విట్టర్ లో సంచలన పోస్ట్ పెట్టారు.శిక్ష సమయం ఆసన్నమైంది ఇంకా తప్పించుకోలేరు అంటూ చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

“కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చు కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగింది.ఇది ఆరంభం మాత్రమే.జీవితాంతం జైల్ లో నే ఉండాల్సినన్ని నేరాలతో కూడిన స్కాం లు చేశారు చంద్రబాబు అండ్ కో.చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ కి( Ramoji ) కూడా చట్టం వర్తిస్తుంది.ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైంది” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.చంద్రబాబు అరెస్టు పట్ల ఉదయం నుండి వైసీపీ నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ కేసు నుండి చంద్రబాబు తప్పించుకోలేరని కామెంట్లు చేస్తున్నారు.మరోపక్క చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామికమని.
వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు.







